లేడీ యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఆమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. మరీ ఆమె 1971సంవత్సరంలో జనవరి 16న విజయవాడలో జన్మించడం జరిగింది. ఝాన్సీ హైదరాబాద్లో కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుకోవడం జరిగింది. అయితే ఝాన్సీ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.
ఆమె ఎల్ కే జి లో ఉన్నప్పుడు పిల్లలందరూ కలిసి రవీంద్ర భారతిలో ఒక డాన్స్ ప్రోగ్రాం చేశారని ఈ ప్రోగ్రాం కి వాళ్ళ అమ్మ వాళ్లు ఝాన్సీకి ఎంతో ప్రాక్టీస్ ఇప్పించారని తెలిపారు ఆమె. ఝాన్సీ వాళ్ళ అమ్మ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. దానితో అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారు రేడియో స్టేషన్ కి తీసుకొని వెళ్తుండేవారట. అక్కడ అల్లరి చేయడం ఇంకా గడుసుగా మాట్లాడడం చేసేవారని చెప్పుకొచ్చింది ఝాన్సి.
ఎవరైనా మాట్లాడితే తాను కూడా అలాగే మాట్లాడేది అంటే ఇమిటేషన్ చేయడం అన్నమాట. వాళ్ళ అమ్మగారు ఆలిండియా రేడియోలో పని చేసేవారు కాబట్టి ఆమెకు ఏ ఏ ప్రోగ్రామ్స్ కొత్తగా వస్తుంన్నాయో తెలిసేది. వాళ్ళ అమ్మగారు చిల్డ్రన్ సెక్షన్ లోనే పనిచేసేది. అందుకే వాళ్లతో పాటు ఈమె కూడా పార్టిసిపేట్ చేసేది. అప్పుడే చిట్టి చిలకమ్మా అనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రాం కి ఝాన్సీ ని ఆడిషన్ చేసి ఎంపిక చేశారు. ఝాన్సీ ఏం భయం లేకుండా వాళ్ళ అమ్మగారు చెప్పినట్లే చేసింది. రేడియోలో అలా కొన్ని ప్రోగ్రా మ్స్, ఇంకా నాటకాలు కూడా చేయడం జరిగింది.
అయితే ఝాన్సీ డిగ్రీ చదువుతున్నప్పుడు ఎస్ వి కృష్ణారెడ్డి గారు ఎగిరే పావురం సినిమా తీశారు. అందులో క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునే అమ్మాయి కోసం ఆడిషన్ జరిగింది. అందులో ఆ పాత్రకి ఝాన్సీ నీ ఎంపిక చేశారు. జి కే మోహన్ ఝాన్సీ గురించి ముందే విన్నారు కాబట్టి ఝాన్సీ ఆడిషన్ ఇచ్చాక ఆమె ఈ ప్రోగ్రాం కి సూట్ అవుతుంది అని నిర్ణయించుకున్నారు. యాంకర్ గా ఝాన్సీ ని ఓకే చేసి అగ్రిమెంట్ రాపించుకున్నారు.
ఆ తరువాత ఆమె టాక్ ఆఫ్ ద టౌన్ అనే షో చేసింది. ఝాన్సీకి ఆ ప్రోగ్రాం చేస్తున్నప్పుడే భారీ సినిమాలలో అవకాశాలు వచ్చాయి. టాక్ ఆఫ్ ద టౌన్ ప్రోగ్రాం అసిస్టెంట్ గా జోగినాయుడు పనిచేసేవారు. ఝాన్సీ గెటప్స్, కాస్ట్యూమ్స్, జోగి నాయుడే చూసుకునేవాడు. అక్కడే ఇద్దరికీ పరిచయాలు ఇంకా ఒకరినొకరు తెలుసుకోవడం తరువాత ప్రేమలో పడడం జరిగింది. 2005వ సంవత్సరంలో ఝాన్సీ జోగి నాయుడిని వివాహం చేసుకోవడం జరిగిపోయింది. వారికి ఒక పాప కూడా ఉందని తెలిపారు.
వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. ఝాన్సీ డైవర్స్ కోసం ఎనిమిదేళ్లు కోర్టు చుట్టూ తిరిగిందట. దానివల్ల ఝాన్సీ కి ఇండస్ట్రీలో తక్కువ అవకాశాలు వచ్చాయని ఈ మాటని తీసుకొని జోగి నాయుడు ఝాన్సీ గురించి ఇండస్ట్రీలో నెగిటివ్ కామెంట్లు చేశాడు. విభేదాలు ఉండకుండా ఎవరి జీవితం వారు గడపాలని అప్పటిలో విడిపోయినట్టు జోగి నాయుడు గతంలో చెప్పాడు.
ఝాన్సీ కూతురు తన వద్దనే ఉంది. జోగి నాయుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. జోగినాయుడు రెండో వివాహం చేసుకున్నాడని తెలిసిన ఝాన్సీ జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అతను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే ఆమెకు ముఖ్యమని తన మంచితనాన్ని మరోసారి చాటుకుంది.
ప్రస్తుతం ఝాన్సి తనకు వచ్చిన అవకాశాలనే వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంది. ఆమె ముఖ్యంగా తనదైన శైలిలో కామెడీని కూడా అద్భుతంగా పండిస్తూ అందరినీ ఇలానే అలరించాలని కోరుకుందాం.