సమంత 20 ఏళ్ళ వయసులో ఎలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఆమె మొదటి యాడ్!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటోన్న స్టార్ హీరోయిన్ స‌మంత. సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మంది కలలు కంటారు. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తారు.

ఇక ఇండస్ట్రీలో రాణించాలనుకునే యువతుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.సరైన అవకాశం వచ్చే వరకు తమ అందాన్ని కాపాడుకుంటూ.. బతకడానికి ఏదో ఓక పని చేసుకుంటూ.. తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇక తమ కంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేవరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా చెన్నై నుంచి త‌న సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మ‌డు.. తెలుగు, త‌మిళ చిత్రాల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకుని స్టార్‌గా ఎదిగింది.

అయితే సమంత మొదటగా తెలుగులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయింది. కానీ ఆ తరువాత ఈ అమ్మడికి పలు చిత్రాల్లో నటించే అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా అలరించక పోవడంతో కొంతకాలం పాటు అవకాశాల కోసం బాగానే శ్రమించింది.

మోడలింగ్ నుంచి సామ్ త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అక్క‌డి నుంచి స‌మంత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీ స్టార్‌గా పేరు సంపాదించుకుంది. త‌న తొలి సినిమా హీరో నాగ చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్ల త‌ర్వాత మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో విడిపోయింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారాలుగా వెలుగుతున్న ఎందరో ఒకప్పుడు యాడ్స్‌లో, మోడల్స్‌గా నటించిన వారే అధికం. ఇక కొందరు బుల్లి తెర మీద కూడా రాణించి ఆ తర్వాత బిగ్‌ స్క్రీన్‌ మీద వెలిగిపోతున్నారు. అయితే గుర్తింపు వచ్చే వరకు వారు నిరంతరం శ్రమిస్తారు. ఎక్కడా కుంగిపోరు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు తప్ప.. చిన్నతనంగా ఫీలవ్వరు. అదిగో అలాంటి వారే నేడు అగ్రతారాలుగా వెలుగొందుతారు. ఈ కోవలోకే వస్తారు నటి సమంత.

సినిమాల్లోకి అడుగు పెట్ట‌క ముందు స‌మంత కొన్ని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో యాక్ట్ చేసింది. తాజాగా ఆమె కెరీర్ తొలి నాళ్ల‌లో న‌టించ‌ని క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ఒక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అది చిక్ షాంపూ కి సంబందించిన యాడ్. అందులో అస్సలు సమంతను గుర్తు పట్టలేని విధంగా ఉంది. అప్ప‌టి ఉన్న స‌మంత‌కు ఇప్ప‌టి స‌మంత‌కు చాలా తేడా ఉంది. దానిని చూస్తే ఇప్ప‌టి స‌మంత త‌నేనా అనే న‌మ్మ‌లేం. ఆ యాడ్ తో పాటు సమంత ఆషిక అనే గోల్డ్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో కూడా కనిపించింది. గతంలో సమంత చేసిన ఈ కమర్షియల్ యాడ్స్ మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

సామ్ పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టించింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా డిజిట‌ల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. యూ ట‌ర్న్‌, ఓ బేబి వంటి చిత్రాల్లో న‌టించి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ఇప్పుడు య‌శోద అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో ఆగ‌స్ట్ 11న రిలీజ్ అవుతుంది.

అలాగే ది అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాలో న‌టించ‌నుంది. ఆమె ఇప్ప‌టికే న‌టించిన పాన్ ఇండియా మూవీ శాకుంత‌లం కూడా రిలీజ్‌కి సిద్ధమ‌వుతోంది. ఇది కాకుండా మ‌రి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు పైప్ లైన్‌లో ఉన్నాయి.

సమంత ప్రస్తుతం తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగి.. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. స్పెషల్‌ సాంగ్స్‌కి కూడా.. కోట్లు తీసుకుంటుంది. ఇక అటు సోషల్‌ మీడియా ద్వారా కూడా ఒక్కో పోస్ట్‌కు లక్షల్లో ఆర్జిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్‌ స్టార్ హీరోయిన్ల సరసన రాణిస్తోంది.

20ఏళ్ల వయసులో సమంత ఎలా ఉందో చూడండి Samantha First TV Ad|Samantha First Acting Video Before Movies