నటి సనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సన తెలుగు చలనచిత్ర నటి. దాదాపు 600కు పైగా చిత్రాలలో పలు పాత్రలలో నటించింది. ఈమె 1971లో హైదరాబాదులో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. విద్యాభ్యాసం కొనసాగుతుండగానే, 14 సంవత్సరాల వయసులోనే సాదత్ అనే అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కూతురు సంతానం.

ఈమెకు మోడలింగ్ చేయాలని కోరిక. తన ఇష్టాన్ని గౌరవించి అత్తమామలు, భర్త ప్రోత్సహించారు. అనుకోకుండా ఈమె డైరెక్టర్ కృష్ణవంశీ దృష్టిలో పడింది. రెండు రోజులు ఆమె ప్రవర్తనను గమనించిన కృష్ణవంశీ సినిమాలలో అవకాశం కల్పించాడు. అలా నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జునకు అత్తగా, బెనర్జీకి భార్యగా నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చి ముందుకు దూసుకుపోయింది. సినిమాలలో దాదాపు అన్ని సహాయ పాత్రలలో నటించి మెప్పించింది. ఆ మధ్య వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రలో కనిపించేది సన. తర్వాత కూతురికి వివాహం చేసింది. కుమారుడు సీరియల్ లకు దర్శకత్వం వహిస్తుంటాడు. ఇక ఈమె కోడలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన కుమారుడు షరీఫ్, బుల్లితెర సీరియల్ లలో నటించే సమీరాను ప్రేమించి కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. సమీరా పలు సీరియల్ లలో నటించింది. అదిరింది షో కు యాంకర్ కా కూడా పనిచేసింది. ఇక తన భర్త తనకు సపోర్టుగా ఉన్నందుకే ఇలా సినిమాలలో రాణించగలుగుతున్నానని, అత్తమామలు కోడలిగా కాకుండా కూతురు లాగా చూసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన మనసులోని మాట చెప్పింది.

ప్రస్తుతం ఇంట్లో తన మనవడితో సరదాగా ఆడుకుంటున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒక ముస్లిం కుటుంబం నుంచి సినిమాలలోకి వచ్చి సంతోషకరమైన జీవితం గడపడం చాలా అరుదు. కానీ ఈమె జీవితంలో అందరూ సపోర్ట్ గా నిలిచారు.