ప్రేమించి చివరికి బ్రేకప్ చెప్పుకున్న సెలబ్రెటీలు ఎవరో తెలుసా?

సినిమా రంగం అంటే ఒక రంగుల ప్రపంచం. నటీనటులు తొందరగా ఆకర్షణకు లోనవడం, ఒకరిపై ఒకరికి ప్రేమతో కొంతకాలం ప్రేమించుకోవడం, చెప్పుకోదగ్గ కారణాలు లేకపోయినా వ్యక్తిగత జీవితంలో స్వాతంత్రంగా జీవించాలని విడిపోవడం ఇక్కడ సర్వసాధారణం.

కొందరు ప్రేమించుకుని ఒకటయ్యారు. మరికొందరు ప్రేమలో విఫలమై ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రేమించి దూరమైన కోవకు చెందిన వారెవరో ఇప్పుడు చూద్దాం.

మంచు మనోజ్, ప్రణతిలు 2015లో వివాహం చేసుకున్నారు. 2019లో విడాకులు తీసుకొని దూరమయ్యారు.

ప్రభుదేవా, నయనతార వీరిద్దరు కూడా కొంతకాలం ప్రేమాయణం కొనసాగించారు. కొన్ని మనస్పర్ధలు వల్ల ఇద్దరూ దూరమై నయనతార, విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది.

అమలాపాల్, ఏ.ఎల్. విజయ్ ఇద్దరు 2014లో వివాహం ద్వారా ఒకటయ్యారు. మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2017లో విడాకులు తీసుకొని ఎవరు దారి వారు చూసుకున్నారు.

అక్కినేని అఖిల్, హరియ భూపాల్ వీరిద్దరూ రెండు సంవత్సరాలపాటు ప్రేమించుకుని, నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల వీరి వివాహం జరగలేదు.

త్రిష, వరుణ్ మణియన్ వీరిద్దరూ కూడా ప్రేమించుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కాని చివరకు నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుని విడిపోవడం జరిగింది.

అరవింద్ స్వామి, గాయత్రి రామమూర్తి వీరిద్దరూ 1994లో వివాహం చేసుకున్నారు. రెండు మూడు సంవత్సరాల తర్వాత మనస్పర్ధలు పెరిగి చివరకు 2003లో చట్టబద్ధంగా విడాకులు తీసుకుని దూరమయ్యారు.

రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి వీరిద్దరూ కిరిక్ పార్టీ సెట్లో ప్రేమలో పడ్డారు. సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. తర్వాత నిశ్చితార్థం క్యాన్సల్ చేసుకొని దూరమయ్యారు.

నాగచైతన్య, సమంత వీరిద్దరు కూడా ప్రేమించుకొని వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. కొన్ని కారణాల వల్ల 2021లో విడిపోవడం జరిగింది.

ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వీరిద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొన్ని కారణాలవల్ల విడిపోయినట్లు తెలుస్తుంది.