గౌతమి తెలుగు చలనచిత్ర సుప్రసిద్ధనటిగా అందరికీ పరిచయమే. ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించడం జరిగింది. ఇతర భాషలైన తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించడం జరిగింది. 1988లో గురు శిష్యన్ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక వరుస సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది.
1988 నుండి 1997 వరకు తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. దయామయుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక వరుస అవకాశాలతో దక్షిణ భారతదేశంలోని అగ్రనటిగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమాల పరంగా కెరీర్ లో సక్సెస్ సాధించింది.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే 1998లో సందీప్ భాటియా అనే పెద్ద వ్యాపారవేతను వివాహం చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే అమ్మాయి సంతానం. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధ కారణాలవల్ల 1999లో విడాకులు తీసుకోవడం జరిగింది. తిరిగి సినిమాలలో నటిస్తూ 2004లో కమలహాసన్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి దాదాపుగా 13 సంవత్సరాల పాటు సహజీవనం చేయడం జరిగింది.
ఇక 2016లో కమలహాసన్ తో విడిపోతున్నట్లు స్వయంగా తానే ప్రకటించింది. తనకు 35 సంవత్సరాలు ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ రావడం జరిగింది. తర్వాత ఆమె క్యాన్సర్ నుండి కోలుకుంది. ఆ తర్వాత క్యాన్సర్ బాధితుల కోసం లైఫ్ అగైన్ ఫౌండేషన్ ను స్థాపించి, అందరికీ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపట్టడం జరిగింది.
అసలు విషయం ఏంటంటే ఇటీవల కాలంలో తిరుమల లో మీడియా ముందు మాట్లాడుతూ, తనకు తిరుమలనుండి క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి పిలుపు వచ్చిందని తెలపడం జరిగింది. తిరుమల నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉందని, ఆ భగవంతుడే తిరుమలకు రప్పించాడని చెప్పడం జరిగింది. ఇక క్యాన్సర్ గురించి మాట్లాడుతూ ఈ క్యాన్సర్ అనేది రావటానికి వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసులో ఉన్న వారికి కూడా వచ్చే అవకాశం ఉంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటేనే ప్రమాదం జరగకుండా చూసుకోగలము. సింటమ్స్ బయటపడ్డాక కొన్ని పరిస్థితులు మన చేతులలో ఉండవు అని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం గౌతమి.. లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను నిర్వర్తిస్తూ, క్యాన్సర్ రోగులకు తగిన రీతిలో సేవలు జీవనం కొనసాగిస్తుంది.