వామ్మో.. సోను సూద్ ఎంత ధనవంతుడో చూశారా?

సోను సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించాడు. సోను సూద్ కెరీర్ ప్రారంభంలో మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. తర్వాత సినిమాలలో నటించాలని ఆసక్తి కలగడంతో నెలపాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1999లో కుళ్ళళలగర్ అనే తమిళ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

మణిరత్నం దర్శకత్వం వహించిన యువ సినిమాలో అభిషేక్ బచ్చన్ కు తమ్ముడిగా నటించాడు. నాగార్జున నటించిన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి సినిమాలో పశుపతిగా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్నాడు.

ఆ తర్వాత వరుస అవకాశాలతో తనకంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఇక భారత దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వారిని సొంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం జరిగింది. అలాగే ఆక్సిజన్ కొడతా ఉన్నచోట సిలిండర్లు సమకూర్చడం.

ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకుతెరువు చూపించడం ద్వారా రియల్ హీరోగా వార్తల్లోకి ఎక్కాడు. ఇలా తనదైన శైలిలో సేవ చేసి తన గొప్ప మనసు ఏంటో చాటుకున్న విషయం అందరికీ తెలిసిందే. సోనూసూద్ ఇంత ఖర్చు చేస్తున్నాడంటే ఎంత ఆస్తి ఉంటుందో అని బాలీవుడ్ అంచనాలు వేస్తే దాదాపుగా 130 కోట్లకు పై మాటే.

సోను సూద్ నటనలోనే కాక రియల్ ఎస్టేట్ వంటి బిజినెస్ రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూ, మరొకవైపు బిజినెస్ రంగంలో కూడా ముందుకు దూసుకుపోతున్నాడని సమాచారం.