చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన వి.వి. వినాయక్.. ఆయన ప్రవర్తన అలా ఉంటుందంటూ!

వి.వి. వినాయక్ తెలుగు సినిమా దర్శకుడు. 2002లో వచ్చిన ఆది సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. తెలుగులో మాస్ కమర్షియల్, కామెడీ చిత్రాలు రూపొందించడంలో ప్రసిద్ధి. వి.వి. వినాయక్ మొదటి సినిమా ఆదితోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఇక 2003లో దిల్, ఠాగూర్ వంటి చిత్రాలను దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందాడు. 2006లో ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఠాగూర్ సినిమా ప్రదర్శింప బడింది. 2013లో అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఒక లఘు చిత్రానికి దర్శకత్వం కూడా వహించడం జరిగింది.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్ వంటి హీరోలకు విజయవంతమైన సినిమాలు అందించాడు. 2008లో కృష్ణ సినిమా ద్వారా కమర్షియల్ దర్శకునిగా మంచి గుర్తింపు పొందాడు. తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎక్కువ విజయాలు సాధించిన దర్శకుడిగా తనకంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే వి.వి. వినాయక్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈయన గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈయన ఠాగూర్ చిత్రం నిర్మిస్తున్న సమయంలో తనకు చాలా భయంగా ఉండేదని, పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏమో అని చాలా కంగారు పడ్డాడట.

కానీ సినిమా షూటింగ్లో చిరంజీవి గారి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. అందరితో ఫ్రీగా, అతి చనువుగా మాట్లాడడం గొప్ప వాళ్లకే చెందుతుంది అనడం కళ్ళారా చూశానని పేర్కొనడం జరిగింది. ఇక చిరంజీవి నటించిన 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 షూటింగ్లో తాను చాలా కంఫర్ట్ గా ఫీల్ తెలపడం జరిగింది. ఈ సినిమా చేసే సమయంలో ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు షూటింగ్ కి వెళ్దామని ఆత్రుతగా ఉండేదని తెలపడం జరిగింది. ప్రస్తుతం ఈయన ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.