హీరో వెంకట్ సినిమాలకు దూరం కావటానికి కారణం ఇదే!

వెంకట్ తెలుగు చలనచిత్ర నటుడు. తెలుగు, తమిళం భాషలలో నటించాడు. ఈయన 1978లో విజయవాడలో జన్మించాడు. విద్యాభ్యాసమంతా విజయవాడలోనే కొనసాగింది. చిన్నతనం నుండే సినిమాలలో నటించాలి అనే ఆసక్తి ఉండేది. సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఈయనకు సినిమా అవకాశం ఇప్పించింది అక్కినేని నాగార్జున గారు. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఏ హీరో కైనా మొదటి సినిమా విజయం అయితే ఆ కిక్కే వేరు. ఇక అవకాశాలు కూడా ఒకరకంగా బాగానే వచ్చాయి. చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో తమ్ముడి పాత్రను పోషించాడు.

ఆ సినిమాతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. కానీ ఇందులో తనతో పాటు నటించిన రవితేజ సక్సెస్ అయ్యారు. కానీ వెంకట్ మాత్రం సినిమాలకు దూరమయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకట్ ను సినిమాలకు ఎందుకు దూరమయ్యారని ప్రశ్నించగా ఆయన స్పందించి చెప్పిన విషయాలు ఎన్నో వైరల్ గా మారాయి.

సినిమాలలో రాణించాలంటే బ్యాగ్రౌండ్ అనేది ముఖ్యం కాదని, బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా చాలామందికి అవకాశాలు తగ్గాయి. టాలెంట్ ఉన్నా కూడా ఎంచుకున్న సినిమా కథలు కూడా ముఖ్యమేనని, వరుసగా రెండు మూడు సార్లు పరాజయం అయితే కచ్చితంగా అవకాశాలు తగ్గుతాయి అన్నారు.

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా ఒక సొంత ప్రొడక్షన్ ఉండాలి. లేదంటే ప్రొడక్షన్ ఉన్నవాళ్లు మనకు సపోర్టుగా ఉండాలి అప్పుడే ప్లాప్ సినిమాలు వచ్చినా కూడా నిలదొక్కుకోవచ్చు లేదంటే చాలా కష్టం. బ్యాగ్రౌండ్ లేకుండా కూడా వచ్చి రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు రాణించగలుగుతున్నారు కదా. కథ అనేది బాగుంటే సరిపోదు అది మనకు సెట్ అవుతుందో కాదో కూడా చూసుకోవాలి.

అన్ని సెట్ అయితేనే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. లేదంటే ఇక అంతే అంటూ గతంలో ఆ ఐదుగురు సినిమాలో తనకు ప్రమాదం జరిగి మూడు నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకున్నానని ఈ విషయం బయట ఎవరికీ తెలియదని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఆయన బిజినెస్ రంగంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మంచి పాత్ర వస్తే కచ్చితంగా నటిస్తానని పేర్కొనడం జరిగింది.