సాయి కిరణ్ భారతీయ చలనచిత్ర నటుడు. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలలో నటించాడు. పలు టీవీ సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. ఈయన 1978లో వి. రామకృష్ణ, జ్యోతి కన్న లకు హైదరాబాదులో జన్మించాడు. ఈయన తండ్రి తెలుగు సినిమాలలో దాదాపు 5 వేలకు పైగా పాటలను పాడారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల సినిమాలలో దాదాపు ఈయన పాడినవే.
ఈయన తల్లి దూరదర్శన్ లో ప్రముఖ గాయకురాలు. ఈయన స్వయాన పి.సుశీల గారి మనువడు. విద్యాభ్యాసం తర్వాత నటనపై ఆసక్తితో అటువైపు అడుగులు వేసి 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయంను తెచ్చి పెట్టింది. తర్వాత 2001లో వచ్చిన ప్రేమించు సినిమాలో ఈయన సరసన లయ నటించిన విషయం తెలిసిందే.
అందరూ ఈడు జోడు బాగుంది అంటే లయను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇంట్లో వాళ్లు కూడా బాగానే ఉంటుంది అనుకొని జాతకాలు చూపించి కుదరకపోవడంతో కుటుంబ సభ్యులు వద్దు అనడంతో వైష్ణవి అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈయనకు ఒక కూతురు అనూష ఉంది. లయతో పెళ్లి కాకపోయినా ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఈయనకు పాములంటే కాస్త ఇష్టం. ఎక్కడైనా పాములు ఉంటే వాటిని పట్టి చంపకుండా దూరంగా వదిలేవాడు. ఈయనకు శివుడు అంటే ఇష్టం ఈయన ఒక శివ భక్తుడు.
ఈయన ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో మహేంద్ర పాత్రను పోషిస్తూ ప్రేక్షకులను చక్కగా అలరిస్తున్నారు. ఈమధ్య వచ్చిన బింబిసారా చిత్రంలో ఒక పాత్రను కూడా పోషించడం జరిగింది ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన గీత అనే సినిమాలో నటించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.