హీరో జగపతిబాబు ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!

జగపతిబాబు తెలుగు సినిమా నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన బి.వి. రాజేంద్రప్రసాద్ కు 1962లో మచిలీపట్నంలో జన్మించాడు.విద్యాభ్యాసమంతా చెన్నైలో కొనసాగింది. 100కు పైగా చిత్రాలలో నటించి రాణించాడు. ఏడు నంది పురస్కారాలను సొంతం చేసుకున్నాడు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలలో నటించాడు.

చదువుకునే రోజుల్లో సినిమాలు చూసే అలవాటు ఉంది కానీ నటించాలనే కోరిక, ఆలోచన ఏమాత్రం లేవు. దీనికి కారణం తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సినిమాలలో నటించను అని ఒట్టు వేయించుకున్నారు జగపతిబాబు అమ్మగారు. ఇక చదువు ముగిసిన తర్వాత విశాఖపట్నంలోని వాళ్ల బిజినెస్ లను చూసుకునేవారు. అనుకోకుండా ఒక రోజు సినిమాలలో నటించాలని నిర్ణయించుకొని, తండ్రి పెద్ద దర్శకనిర్మాత అయిన కూడా ఆయనకు చెప్పకుండా, ఆయన ప్రమేయం లేకుండా సొంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతి బాబు గారి కోరికను తెలుసుకొని 1989లో సింహ స్వప్నం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇందులో కథానాయకుడు కృష్ణంరాజు. మొదటి సినిమాలోని ద్విపాత్రాభిమానం చేసిన మొదటి నటుడు జగపతిబాబు. ఈ సినిమా పరాజయం అయింది. తర్వాత కూడా కొన్ని సినిమాలు పరాజయం అయితే పట్టు వదలకుండా జగన్నాటకం, పెద్దరికం సినిమాల ద్వారా విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శుభలగ్నం సినిమా కుటుంబ కథ చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత మావిచిగురు, పెళ్లి పీటలు సినిమాలు మంచి విజయాలు తెచ్చి, మావి చిగురు సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. ఇలా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇక సినిమాలలో విలన్ గా, హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ రాణిస్తున్నారు. అయితే జగపతిబాబు 2022 ఫిబ్రవరి 12న తన పుట్టినరోజు సందర్భంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో 2022 ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన అవయవ దాన అవగాహన సదస్సులో చీఫ్ గెస్ట్ గా పాల్గొని తన మరణాంతరం అవయవాలు దానం చేస్తానని ప్రకటించారు. 100 మంది అభిమానులు కూడా ప్రమాణ పత్రంపై సంతకాలు చేశారు.