హీరో నానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇంతకూ అసలు కారణం ఏంటంటే?

నాని తెలుగు హీరోగా అందరికి సుపరిచితమే. 2008లో అష్టా చమ్మా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను రెండు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ క్రిటిక్ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఇలా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతూ ఎన్నో మంచి మంచి విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్న నాని గతంలో చిరంజీవి హోస్టుగా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో హీరో నాని అతిథిగా వచ్చి తన మనసులో మాటలు పంచుకోవడం జరిగింది.

మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో పాల్గొని ఆడడం చాలా సంతోషంగా ఉందని చిన్నప్పటినుండి చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని పేర్కొనడం జరిగింది. చిరంజీవి నటించిన చంటబ్బాయి చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమాను రీమేక్ చేయాలని ఎవరైనా నిర్మాతలు తన దగ్గరకు వస్తే చంటబ్బాయి సినిమాని రీమేక్ చేయాలని ఉంది అని చాలాసార్లు చెప్పానని తెలిపాడు.

ఇంకా చిరంజీవి నటించిన మాస్టార్ సినిమా తాను అమీర్ పేట్ లోని సత్యం థియేటర్లో చూసానని టికెట్ సంపాదించడం కోసం సైకిల్ కు స్టాండ్ వేసి తాళం మర్చిపోయి వెళ్లానని చెప్పాడు. టికెట్లు దొరికిన ఆనందంలో సైకిల్ పోయిందన్న బాధను కూడా మర్చిపోయి సంతోషంగా సినిమా చూసినట్లుగా పేర్కొన్నాడు.

ఇలా సైకిల్ పోవడం చాలా చిన్న విషయం అని తాను అనుకున్నానని, సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి సైకిల్ పోయిందన్న బాధ కలిగిందని తెలిపాడు. ఎప్పుడైనా చిరంజీవి గారు కనిపిస్తే కచ్చితంగా తన సైకిల్ కొనియమని అడగాలి అని అనుకున్నాడట. భలే భలే మగాడివోయ్ సినిమా షూటింగ్ తర్వాత అల్లు అరవింద్ గారిని అడిగితే ఇస్తానని చెప్పారని తెలిపారు.

తర్వాత ఆయన కొనివ్వలేదు అంటే చిరంజీవి తాను కొనిస్తానంటూ చెబితే చాలా ఆనందంగా అనిపించింది అని తెలిపాడు. ప్రస్తుతం నాని ఒక సినిమాకు సంతకం చేసి బిజీగా ఉన్నట్టు సమాచారం.