మంచు మనోజ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడట.. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?

మంచు మనోజ్ అందరికీ సుపరిచితమే. ఈయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండవ కుమారుడు. ఈయన 1984లో జన్మించాడు. ఈయనకు ఒక అక్క లక్ష్మి, అన్న మంచు విష్ణు ఉన్నారు. మనోజ్ కు చిన్నప్పటినుండి సినిమాలంటే చాలా ఇష్టం. తనకు 10 ఏళ్ల వయసున్నప్పుడే మేజర్ చంద్రకాంత్ చిత్రం ద్వారా బాల్య నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత మూడు, నాలుగు చిత్రాలలో బాల్య నటుడుగా నటించాడు. ఇక 2004లో వచ్చిన దొంగ దొంగది చిత్రం ద్వారా తెలుగు కథానాయకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తండ్రి వారసత్వం కాకుండా తన నటనతో తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతూ, ఈయన నటించిన బిందాస్ సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నంది స్పెషల్ జూరి అవార్డును సొంతం చేసుకున్నాడు.

పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈయనకు 2013లో ఒకరోజు రాత్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవిస్తే కారులో ఉన్న గాలి బుడగలు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాదులో 2015లో మంచు మనోజ్, ప్రణతిల వివాహం హైటెక్స్ లో ఘనంగా జరిగింది. తరువాత రెండు సంవత్సరాలకు కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నాడు.

అప్పటినుండి కాస్త డిప్రెషన్ లోకి వెళ్లి సినిమాలకు కూడా కాస్త దూరమయ్యాడు. ఇక ఈయన గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడాని న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకు ఆ వధువు ఇంకెవరో కాదు ఆళ్లగడ్డ లోని భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక తో వివాహం నిశ్చయం అయిందని తెలుస్తుంది. మొత్తానికి మంచు మనోజ్ శుభవార్త చెప్పారని ప్రేక్షకుల్లో ఆనందం నెలకొంది.