ఇంటర్వ్యూ మధ్యలోనే కోపంగా వెళ్ళిపోయిన జొన్నలగడ్డ సిద్దు.. అసలేం జరిగిందంటే?

సిద్దు జొన్నలగడ్డ ఒక తెలుగు సినీ నటుడు, స్క్రీన్ రైటర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకుసిద్దు జొన్నలగడ్డ ఒక తెలుగు సినీ నటుడు, స్క్రీన్ రైటర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అంతకుముందు జోష్, ఆరంజ్, భీమిలి కబడి జట్టు సినిమాల్లో సహాయ పాత్రలలో నటించాడు.

ఇక సినిమాలలో బిజీగా రాణిస్తూ ఈయన నటించిన DJ Tillu movieతో మంచి గుర్తింపు పొంది పాపులర్ అయ్యాడు. ఇక DJ టిల్లు పాటలు అయితే మరింత ఫేమస్ అయ్యాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ నిర్వహించిన సిద్దుకు సరదాగా ఈ మ్యూజిక్ కు తన పేరు వేస్తానంటే వద్దు తన ఇజ్జత్ బదలామైతది అని ఫన్నీగా మైక్ తీసేసి మాట్లాడడం జరిగింది.

ఒక ఆర్టిస్టుగా తను చేయని పనికి తన పేరు వేస్తే తన అంతరాత్మ ఒప్పుకోదు కదా అని పేర్కొనడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సుధీర్ బాబు ఫన్నీగా సిద్దుతో ఆడుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.

తర్వాత సిద్దు ఈ కార్యక్రమానికి పేమెంట్ ఎవరిస్తారు అని ప్రశ్నించగా అందుకు బదులుగా వెన్నెల కిషోర్, సిద్దు ను ఈ షోకు ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తాడు. అందుకు సిద్దు తన కారులోనే వచ్చానంటూ చెబితే అవునా లేకపోతే మా కారులో డ్రాప్ చేసే వాళ్ళమని సరదాగా మాట్లాడుకుంటారు. ఇక సుధీర్ బాబు అయితే మీకు కాఫీ ఇచ్చాం కదా సరిపోదా అంటూ నవ్వుతూ సరదాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంటర్వ్యూ నిర్వహించిన సిద్ధు ను వెన్నెల కిషోర్, హీరో సుధీర్ బాబు సరదాగా ఆడుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిని చూసినా చాలామంది నెటిజన్స్ ఫన్నీ ఇంటర్వ్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.