నటి శ్రీవిద్య జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొందో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!

శ్రీవిద్య భారతీయ చలనచిత్ర నటి, గాయని. ఈమె 1953లో చెన్నైలో జన్మించింది. ఈయన తండ్రి హాస్యనటుడు కృష్ణమూర్తి. తన చిన్నతనంలోనే తండ్రికి పక్షవాతం రావడంతో ఎన్నో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1972లో మలయాళ సినిమాలో నృత్య గాయనిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.1972లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తాతామనవడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈమె ఎక్కువగా తల్లి పాత్రలు, అక్క పాత్రలు, వదిన పాత్రలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తను ఏ సినిమాలో నటించిన తన వల్ల ఆ సినిమాకే మంచి పేరు వచ్చేది అలాంటి రోల్ లో నటించి గొప్ప పేరు తెచ్చుకుంది.1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమా తన జీవితాన్నే మార్చివేసింది. ఈ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్లు రజినీకాంత్, కమల్ హాసన్ లు నటించారు.

ఈ చిత్రంలో రజనీకాంత్ భార్యగా, కమల్ హాసన్ ప్రేయసిగా నటించింది. ఈ చిత్ర నిర్మాణంలో అనుకోకుండా కమల్ హసన్ తో ప్రేమలో పడింది. కొన్ని కారణాలవల్ల వాళ్ల పెళ్లి జరగలేదు. తరువాత ఆమె మలయాళ చిత్రం తీక్కనల్ సహాయ దర్శకుడు జార్జ్ థామస్ ప్రేమలో పడింది. తమ కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి 1978లో జార్జ్ థామస్ పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు జార్జ్ కోరిక మేరకు క్రైస్తవ మతంను స్వీకరించింది.

వివాహం తర్వాత గృహిణిగా ఉండాలనుకుంటే ఆర్థిక సమస్యల వల్ల తిరిగి నటించాలని జార్జ్ ఒత్తిడి తెచ్చాడు. ఇక చేసేదేమీ లేక సినిమాలలో నటించడం ప్రారంభించింది. కానీ తన సంపాదన మీదనే జార్జ్ ఆధారపడడం, జార్జ్ ప్రవర్తన నచ్చక తాను తీసుకున్నది తప్పుడు నిర్ణయం అని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తరువాత వారి మధ్య వివాదాలు పెరిగి చివరకు విడాకులు తీసుకున్నారు.

తరువాత 2003లో ఆరోగ్యం బాగాలేక బయాప్సీ చేయించుకుంటే అందులో రొమ్ము క్యాన్సర్ అని బయటపడింది. తన పేరు మీద ఆస్తి ఉండకూడదు అని ఆ సమయంలో తమిళనాడు ప్రభుత్వం సంగీత విద్యార్థులకు స్కాలర్షిప్ ను నిలిపివేస్తే ఒక ట్రస్టు స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇచ్చింది. తరువాత కొంత భాగం తన కుటుంబీకులకు, తన ఇంట్లో పని వాళ్లకు కూడా ఇచ్చి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా 2006లో చెన్నైలో మరణించడం జరిగింది.