జానీ మాస్టర్ ఒక భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో పనిచేశాడు. ఈటీవీలో వచ్చిన రియాలిటీ డాన్స్ షో, అల్టిమేట్ డాన్స్ షోలో డాన్సర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. 2009లో ద్రోణ సినిమాకు కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత 2012లో వచ్చిన రచ్చ సినిమాకు కొరియోగ్రాఫర్ గా చేయడం జరిగింది.
రామ్ చరణ్ తను నటించే సినిమాలకు దాదాపుగా జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా నియమించుకోవడం జరిగింది. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్, రవితేజ వంటి అగ్ర హీరోల సినిమాలలో కొరియోగ్రాఫర్ గా అవకాశాలు వచ్చాయి. 2014లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన జయహో సినిమాకు కూడా కొరియోగ్రాఫర్ గా చేయడం జరిగింది.
రెండు టెలివిజన్ రియాల్టీ డాన్స్ షోలకు కొరియోగ్రాఫర్ గా, గురువుగా పనిచేశాడు. ఈయన అలా వైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మ పాటకు చేసిన కొరియోగ్రాఫర్ ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా విజయం సొంతం చేసుకుంది.
జానీ మాస్టర్ తెలుగు ఇండస్ట్రీలో అందరూ అగ్ర హీరోలతో పనిచేశాడు. అనేక రియాలిటీ డాన్స్ షోలకు కొరియోగ్రాఫర్ గా, జడ్జిగా వ్యవహరించడం జరిగింది. అయితే తన భార్య డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడని, ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియక రామ్ చరణ్ కి ఫోన్ చేస్తే అపోలో ఆసుపత్రికి వెళ్ళమని చెప్పాడంట.
హాస్పటల్లో ట్రీట్మెంట్ అయ్యాక లక్ష రూపాయలు బిల్ అయితే ఎలా పే చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే హాస్పిటల్ స్టాప్ ఉపాసన గారు మీ బిల్ పే చేసేసారు అని చెప్పగానే సంతోషంతో కళ్ళలో నీళ్లు వచ్చాయట. టాలీవుడ్ లో జానీ మాస్టర్ కు రామ్ చరణ్ మంచి ఫ్రెండ్ అని చెప్పుకుంటారు అందరూ.
ఇక జానీ మాస్టర్ ఒక్కో సినిమాకు 20 నుండి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇక స్పెషల్ సాంగ్ కైతే పది లక్షలకు పైనే పారితోషకం ఉంటుందట. మొత్తానికి హైదరాబాద్, బెంగుళూరులలో దాదాపు 8 నుండి 10 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం.