మహేష్ ఆనంద్ ఒకప్పుడు విలన్ గా అందరికీ సుపరిచితుడే. ఈయన 1961 లో ముంబైలో జన్మించాడు. ఈయనకు ఒక సోదరి ఉంది. ఈయనకు కరాటే అంటే ఇష్టం. చిన్నప్పటినుండే కరాటేపై దృష్టి సారించి కరాటేలో బ్లాక్ బెల్ట్ గా ప్రసిద్ధి చెందాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత మీద పడింది. డబ్బు సంపాదించి సోదరి వివాహం చేశాడు. ఇతను మార్షల్ క్లాసులు నిర్వహించేవాడు.
ఒక నిర్మాత తన కుమారునికి కరాటే కోసం ఇతని వద్ద చేర్పించాడు. ఇతని బాడీ ముఖ అభిప్రాయం చూసి సినిమాలలోకి వస్తావా నీవు విలన్ గా అయితే రాణించగలుగుతావు అంటూ తన ఫోటోలను తెలిసిన దర్శకులకు చూపించాడు. అలా 1984లో చిన్న అవకాశం ఇస్తే బాగానే నటించి ఐదు సంవత్సరాలలో 25 పైగా చిత్రాలలో నటించాడు. అమితాబచ్చన్ తో నటించడం దాసరి దృష్టిలో పడడం ఆయన చిరంజీవి నటించిన లంకేశ్వరుడు చిత్రంలో ఇచ్చాడు.
తరువాత ఘరానా మొగుడు ఇలా చిరంజీవి సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక తమిళం మలయాళం లోను అవకాశాలు వచ్చి బిజీగా గడుపుతున్న సమయంలో ప్రముఖ నటి రీనా రాయ్ సోదరి రుక్క రాయ్ నీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒకప్పుడు మిస్ ఇండియా గా కూడా సెలెక్ట్ అయింది. రెండు సంవత్సరాల తర్వాత కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నాడు. ఇక ఈయన జీవితంలో ఏ అమ్మాయి నిలువలేదు.
ఎవరి మాట వినేవాడు కాదు.ఇలా దాదాపుగా 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వైవాహిక జీవితం సరిగ్గా లేదని తాగుడుకు బానిసై అవకాశాలు లేక ఉన్న ఆస్తిని అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో ఇక చివరగా రష్యాలోని ఉషా బచ్చని ఈయనకు సెట్ అయింది. ఈమెను పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక కుమారుడు కూడా సంతానంగా ఉన్నాడు. కానీ ప్రవర్తన నచ్చగా ఆమె తిరిగి రష్యా వెళ్ళిపోయింది.
మద్యానికి బానిసై గుండెనొప్పితో చనిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని కారణంగా మూడు రోజులకు విషయం బయటపడడంతో సోదరి వచ్చి అంత్యక్రియలు కొనసాగించింది. మూడు రోజులు కావడంతో శరీరం నుండి దుర్వాసన వస్తుందని వైద్యులు వెల్లడించారు.