ఆయనను కలిస్తే సరిపోయేది అనుకున్న.. కానీ ఆయనతోనే నటించా: సత్యదేవ్

సత్యదేవ్ తెలుగు సినీ నటుడు. సపోర్టింగ్ రోల్స్ తో కెరియర్ ప్రారంభించి, ప్రముఖ నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. సత్యదేవ్ తన కెరీర్ ను షార్ట్ ఫిలింలతో ప్రారంభించాడు. ఇతను నటించిన జ్యోతిలక్ష్మి, క్షణం, బ్రోచేవారేవరురా, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాల ద్వారా తన నటనకు మంచి గుర్తింపు లభించింది.

2011లో విడుదలైన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్రతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, ముకుంద లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. సత్యదేవ్ కు గుర్తింపు తెచ్చిన మొదటి చిత్రం ”మైనే ప్యార్ కియా”.

ఇక వరుస సినిమాలతో తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఇటీవల కాలంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా తన మనసులో మాటను బయట పెట్టాడు సత్యదేవ్. తాను సినిమాలలోకి రాకముందే మెగాస్టార్ చిరంజీవిని చూడాలని.. ఆయనతో మాట్లాడాలని చాలా కోరికగా ఉండేదని తెలిపారు.

కానీ అదృష్టం ఏంటంటే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం తన అదృష్టంగా భావించానని తెలిపాడు. ఒక వ్యక్తిని తాము చూడాలి అని అనుకున్నప్పుడు.. ఆ వ్యక్తి సినిమాలో అవకాశం వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది అని పేర్కొనడం జరిగింది.

ఇక గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్లో తనకు.. చిరంజీవికి మధ్య జరిగిన సంభాషణలు ఎన్నటికీ మర్చిపోలేనని, చిరంజీవి రేపు షూటింగుకు వస్తున్నారు అంటే చాలా ఉత్సాహంగా ఎదురుచూసే వాడినని తెలిపాడు. ఇక తనకు అత్తారింటికి దారేది సినిమాలో కూడా విలన్ పాత్రలో ఒక అవకాశం వచ్చిందని తెలిపాడు.

దర్శకుడు త్రివిక్రమ్ తో మాట్లాడిన తర్వాత ఆ పాత్రకు తాను సెట్ కాకపోవడం వల్ల వదిలేయడం జరిగిందని తెలిపాడు. ప్రస్తుతం ఈయన రామసేతు అనే హిందీ సినిమాలో నటించడం జరిగింది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.