కెరీర్ మొదట్లో జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ ఎంత కష్టపడ్డాడో తెలుసా?

రామ్ ప్రసాద్ జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితమే. ఈయనను అందరూ ఆటో రామ్ ప్రసాద్ గా పిలవడం జరుగుతుంది. రామ్ ప్రసాద్ 2009లో విడుదలైన జోష్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తర్వాత అవకాశాలు లేక తిరిగి తన సొంత ఊరు విశాఖపట్నం కు వెళ్లి మెడికల్ కు సంబంధించిన బిజినెస్ చేయాలనుకున్నాడు.

తరువాత మల్లెమాల వారి జబర్దస్త్ షో అవకాశం వచ్చింది. మొదట్లో రామ్ ప్రసాద్, ధనరాజ్ ఇంకా సుడిగాలి సుధీర్ కోసం స్క్రిప్టులు రాసేవాడు. తరువాత వాళ్ల టీమ్లలో చేసే అవకాశం వచ్చి.. సుడిగాలి సుధీర్ టీంలో కొనసాగడం జరిగింది. ఇక మరొకవైపు రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా చూపిస్త మామ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ లో నటించడం జరిగింది.

ఇలా బుల్లితెరలో నటిస్తూ అడపాదడప వచ్చే సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఇంటర్వ్యూ ద్వారా తన నిజ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది. తన భార్య మూడవ తరగతి నుంచే తన క్లాస్మేట్ అని చెబుతూ.. అప్పట్లో ఎక్కువగా మాట్లాడే వారు కాదని తెలిపాడు. తన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారిందట.

తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో తాను సపోర్టుగా ఉండి సహాయం చేయడం జరిగిందని తెలిపాడు. తరువాత ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకోవడం జరిగింది అని పేర్కొనడం జరిగింది. కానీ ఆ సమయంలో ఇతనికి సొంత ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చాడు.

తనకు ఏమీ లేని సమయంలో తనను ప్రేమించి సపోర్టుగా ఉండి కుటుంబ సభ్యులను సైతం ఒప్పించి వివాహం చేసుకుంది అంటే అది తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. వీరి కుటుంబాల మధ్య ఆర్థికంగా చాలా తేడా ఉందని.. వాళ్లది వెల్ సెటిల్ ఫ్యామిలీ అయినా కూడా నాతో పెళ్లికి ఒప్పుకోవడం ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి అని తెలిపాడు. ప్రస్తుతం ఈయన జబర్దస్త్ షోలో కొనసాగుతూ అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.