ఈ నటీనటులకు ఇంతకుముందు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని మీకు తెలుసా?

సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఆకర్షణకు లోనై చాలామంది నటీనటులు లవ్ ఎఫైర్స్ నడపడం ఇండస్ట్రీలో మామూలే. ఇలాంటి కోవకు చెందిన కొంతమంది సెలబ్రిటీలను మనం ఇప్పుడు చూద్దాం.

చార్మి: తన అంద చందాలతో, హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం చార్మి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సన్నిహితంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పూరి ఏ ఆడియో ఫంక్షన్ కి వెళ్లిన అక్కడ కచ్చితంగా చార్మి ఉంటుంది. వీరిద్దరూ కలిసి ఇటీవలే విడుదలైన లైగర్ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎక్కడ కనిపించినా కొత్తజంట లాగా ఉంటారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

నయనతార: మొదట హీరో శింబు తో ప్రేమాయణం నడిపింది. తరువాత శింబు, హన్సికతో ప్రేమలో పడితే నయన మాత్రం పెళ్లయిన ప్రభుదేవాను ప్రేమించింది. నయనతార కోసం ప్రభుదేవా ఏకంగా పెళ్ళానికి విడాకులు ఇచ్చేశాడు. కొంతకాలం తర్వాత భార్యనే వదిలేశావు తనను కూడా ఎప్పుడో ఒకసారి వదిలేస్తాడేమో అని విఘ్నేష్ తో ప్రేమలో పడి కొంతకాలం తర్వాత వివాహం చేసుకుంది.

అమలాపాల్: ఈ బ్యూటీ పెళ్లయిన రెండు సంవత్సరాలకే విడిపోవడం జరిగింది. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా పెళ్లికి ముందే ఒక ప్రొడ్యూసర్ కొడుకుతో సన్నిహితంగా ఉంది అని తెలియడం ద్వారా భర్త విడాకులు ఇచ్చాడని సమాచారం.

త్రివిక్రమ్: ఈ దర్శకుడు హీరోయిన్ పార్వతి మెల్టన్ ప్రేమలో పడ్డాడు. కొంతకాలం వీరి ప్రేమాయణం సాఫీగానే సాగింది. ఈయన ఆమెకు ఒక విలువైన డైమండ్ నెక్లెస్ ను కూడా ప్రజెంట్ చేశాడు కానీ వీరి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు.

త్రిష: ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో హీరో రానా ప్రేమలో పడిందని, అందుకే పబ్లిక్ గా ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు అనే వార్తలు కూడా ఘాటుగానే వినిపించాయి. కొంతకాలం సన్నిహితంగా ఉంటూ కొన్ని మనస్పర్ధల వల్ల దూరమయ్యాయి అనే వార్తలు వినిపించాయి.

నిత్యామీనన్: తన నటనతో మంచి గుర్తింపు పొందిన నిత్యామీనన్ నటుడు సుదీప్ మధ్య కొంతకాలం ప్రేమాయణం కొనసాగింది. వీరిద్దరూ చాలాకాలం కలిసి కూడా ఉన్నారు అనే వార్తలు వినిపించాయి. తరువాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయి, దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.