రఘు బాబు తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. ఈయన నటుడు గిరిబాబు కుమారుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో గిరిబాబు, రఘుబాబులు ఒక వెలుగు వెలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరి నటనతో వారు ప్రత్యేక గుర్తింపు పొందారు.
అయితే గిరిబాబుకు రెండవ కుమారుడు బోసు బాబు రెండు, మూడు సినిమాలకే పరిమితం అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీలో గిరిబాబు కొన్ని వందల సినిమాలలో నటించడం జరిగింది. తరువాత నిర్మాతగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు. మరొకవైపు రఘు బాబు కూడా తన పాత్రలతో గుర్తింపు పొంది ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.
ఈయన కూడా కొన్ని వందల సినిమాలలో సహాయక పాత్రలో నటించడం జరిగింది. గిరిబాబు తన రెండవ కుమారుడు బోసు బాబును హీరో చేయాలనుకున్నాడు. బోసు బాబును హీరోగా పెట్టి ఇంద్రజిత్ సినిమా తీశాడు. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఒక నెల అటూ ఇటూ ఉండగా చిరంజీవి నటించిన కొదమ సింహం చిత్రం విడుదలయ్యింది.
ఈ రెండు సినిమా కథలు ఇంచుమించు ఒకేలా ఉండడంతో ఇందులో కాస్త కుట్ర జరిగిందని బయ్యర్లు సగం రేటుకే సినిమాను తీసుకుని వాళ్లు లాభపడి గిరిబాబును నష్టపరిచారు. ఆ తరువాత రెండు మూడు ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. తరువాత బోసు బాబు ను హీరోగా పెట్టి సినిమా చేయడానికి ఏ దర్శక నిర్మాతలు ముందుకు రాలేదు.
ఇక ప్రభాకర్ బుల్లితెర పై నటిస్తూ అక్కడ కొన్ని అవకాశాలు ఉన్నాయంటే బోసు బాబు బుల్లితెరకు పరిమితమై సీరియల్స్ లలో పలు పాత్రలలో నటిస్తున్నాడు. అందుకే చెబుతారు ఎవరి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాలం అందరినీ ఒకేలా చూడదు కొందరిని స్టార్ గా చేస్తే మరికొందరిని అవకాశాలు లేకుండా దూరం చేస్తుంది.