మహేష్ బాబు తనను అన్యాయం చేశాడంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టిన యాంకర్ రష్మీ గౌతమ్!

టాలీవుడ్‌లో ఎందరో సెలబ్రిటీలు చాలా కాంట్రోవర్సీల్లో చిక్కుకున్న సమయాలు మనం చూశాం. కానీ ఓ సెలబ్రిటీ ఫ్యామిలీ మాత్రం నామమాత్రమైనా ఒక్కటంటే ఒక్క కాంట్రోవర్సీలో కూడా చిక్కుకోలేదు. అదే సూపర్‌స్టార్ ఘట్టమనేని ఫ్యామిలీ వారు. అప్పటి సూపర్‌స్టార్ కృష్ణ మొదలు ఇప్పటి సూపర్‌స్టార్ మహేష్ వరకు అందరూ ఎంతో హుందాగా నడుచుకుంటూ వస్తున్నారు.

తమ ఫ్యామిలీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వారి పరువును కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయితే మహేష్ బాబు తనను మోసం చేశాడంటూ మీడియా ముందు వాపోయింది ఓ హాట్ బ్యూటీ. అదేంటి మహేష్‌కు నమ్రతతో ఎప్పుడో పెళ్లయిపోయిందిగా.. మరి ఇప్పుడు కొత్తగా ఈమె ఎవరు అని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

తన హాట్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్ ఇటీవల కాలంలో చాలా ఫేం సంపాదించుకుంది. బుల్లి తెర హాట్ యాంకర్ రష్మి గౌతమ్ నటించిన సినిమాలు లెక్కల్లో తక్కువ అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంది అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో ఎక్స్‌పోజింగ్ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న రష్మీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

గుంటూర్ టాకీస్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను థియేటర్స్‌ వైపు పరుగులు పెట్టించేసింది ఈ హాట్ బ్యూటీ. ఇక ఈ సినిమా చూసిన వారు చాలా మంది రష్మీ ఇంత హాట్‌గా ఉంటుందా అని చూసి నివ్వెరపోయారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అనుకోకుండా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై కాస్త నోరు జారినట్లే జారీ కాస్త కవర్ చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ మహేష్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది.

అయితే ఈ హాట్ అమ్మడు సూపర్‌స్టార్ మహేష్ బాబు తనను మోసం చేశాడంటూ షాక్ ఇచ్చింది తెలుగు మీడియా వారికి. అంతేకాదు తనకు అవకాశం వస్తే మహేష్‌ను చంపేస్తాను అంటుంది. ఇంతకీ ఈ బ్యూటీకి ప్రిన్స్ పై అంత కోపం ఎందుకు వచ్చింది అంటే.. మహేష్ లాంటి అందగాడు అప్పుడే పెళ్ళి చేసుకుని తన లాంటి వాళ్లకు అన్యాయం చేసాడని రష్మీ చెప్పుకుని బాధ పడింది.

ఇంకా మహేష్ బాబును మొత్తంగా ముద్దు పెట్టుకోవాలని ఉందనీ కూడా తెలిపింది. మొత్తానికి రష్మీ మహేష్ బాబుపై తనకున్న క్రష్‌ను ఈ విధంగా చెప్పేసింది. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఇప్పటి వరకు ఏ టాప్ యంగ్ హీరో తోను నటించడానికి అవకాశాలు రాక సతమతమైపోతున్న రష్మీ ఏదో విధంగా మహేష్ తో సినిమాలలో నటించే అవకాశం దక్కించుకోవడానికి ఇలా కామెంట్ చేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వాదనకు కాస్త బలం లేకపోలేదు ఎందుకంటే ఈ మధ్య ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రష్మీ మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటించిన సినిమాలో ఒక రోల్ చేసిందని అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా విడుదలై యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. మరి ఆ సినిమాలో ఆమె ఏ రోల్ లో కూడా కనిపించలేదు. అయితే ఈ వార్తలలో నిజం లేదని తేలిపోయింది.