ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ మండలస్థాయి వరకు పూర్తి చేసింది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను కూడా త్వరలో పార్టీ నియమించనుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారట.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారట.
ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లలో ఎక్కువ అనుభవం ఉన్నది అచ్చెన్నాయుడికే. అధికార పార్టీ నాయకులకు సమాధానం చెప్పే సత్తా ఉన్న నేత. అందుకే.. పార్టీ సీనియర్లు కూడా అచ్చెన్నాయుడి వైపే మొగ్గు చూపుతున్నారట. దీంతో చంద్రబాబు కూడా అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు సమాయత్తం అవుతున్నారట.ఈ టాపిక్ హాట్ లో బాగంగా “తెలుగు రాజ్యం” ప్రత్యేక అభిప్రాయం సేకరణలో పాల్గొని, మీ అభిప్రాయం చెప్పండి.
[yop_poll id=”3″]