YS Sharmila: నవ్వులపాలవుతున్న షర్మిల ‘వ్యాక్సిన్’ ట్వీట్లు

YS Sharmila Funny Tweets On T'Vaccine

YS Sharmila: వ్యాక్సిన్ల విషయంలో ఎవరైనా ప్రశ్నించాల్సింది కేంద్రాన్నే. ఎందుకంటే, కేంద్రం కనుసన్నల్లోనే వ్యాక్సిన్ తయారీ సంస్థలు పనిచేస్తున్నాయి. కేంద్రం, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహాలు, రుణ సౌకర్యాలూ కల్పిస్తోంది. అందుకే, కరోనా వ్యాక్సిన్ ధరని, ‘తక్కువగా’ చేసి, కేంద్రానికి అందించాలయి వ్యాక్సిన్ తయారీ సంస్థలు. రాష్ట్రాలకు ఇంకో ధర నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రానికి 50 శాతం వ్యాక్సిన్లు 150 రూపాయల ధరకు అందించి, రాష్ట్రాలకు ఎక్కువ ధరలకు విక్రయించేలా వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కేంద్రమే వెసులుబాటు కల్పించింది.

YS Sharmila Funny Tweets On T'Vaccine
YS Sharmila Funny Tweets On T’Vaccine

ఈ తరుణంలో కేంద్రాన్ని కదా ఎవరైనా ప్రశ్నించాల్సింది ఉచిత వ్యాక్సిన్ల విషయంలో. ప్రశ్నించడం మానేసి, రాష్ట్రాలు ‘మేమే మా పౌరులకు ఉచిత వ్యాక్సిన్ అందిస్తాం..’ అనడం నూటికి నూరుపాళ్ళూ డొల్లతనమే. దేశంలో పలు రాష్ట్రాలు తమ పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించాయి. తెలంగాణ కూడా అదే బాటలో నడిచింది. మొత్తంగా అన్ని రాష్ట్రాలూ తమ పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాల్సిందే. లేదంటే, ప్రజా తిరుగుబాటు తప్పదు.

ఇక, వ్యాక్సిన్ విషయమై వైఎస్ షర్మిల పబ్లసిటీ స్టంట్ చేశారు సోషల్ మీడియా వేదికగా. వ్యాక్సిన్ తెలంగాణలో ఉచితంగా అందించాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేశారు. ఇలాంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరూ డిమాండ్ చేయాల్సిన పని వుండదు. కేసీఆర్ ప్రభుత్వం, అందరికంటే ముందే ఇలాంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే, కేసీఆర్ సహా కేటీఆర్ కూడా కోవిడ్ బారిన పడ్డంతో నిర్ణయాల్లో కొంత ఆలస్యం జరిగిందంతే.

ప్రభుత్వం నుంచి ఉచిత వ్యాక్సిన్ ప్రకటన రాగానే, దాన్ని తమ క్రెడిట్.. అని ప్రకటించేసుకున్నారు షర్మిల. అక్కడికేదో షర్మిల ట్వీట్ చూసి తెలంగాణ ప్రభుత్వం వణికిపోయిందని అంతా అనుకోవాలేమో. అలా ఎవరూ అనుకోలేదు సరికదా, షర్మిల పబ్లసిటీ ట్వీట్లు చూసి నవ్వుకుంటున్నారంతా. తెలంగాణలో రాజకీయంగా బలపడాలనుకుంటే ఇలాంటి ఫన్నీ ట్వీట్లు షర్మిల అండ్ టీమ్ మానుకుంటే మంచిదేమో.