2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాత్రం అంత దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారు. ఇప్పటికే దాదాపు ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు కోర్ట్ ల దగ్గరకు వచ్చాయి. పాలనలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేవలం రూ. 130 కోట్లు ఖజానాలో ఉంచారు. డబ్బులు లేకపోవడం వల్ల జగన్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ భవిష్యత్ రాజకీయం ప్రధాని మోడీ చేతిలో ఉంది.
జగన్ భవిష్యత్ మోడీ చేతులో !!
2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి జగన్ ప్రత్యేక హోదా తెస్తానని చెప్పడం, పోలవరం పూర్తి చేస్తానని చెప్పడం వల్లే. అయితే అధికారంలోకి రాకముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఇప్పుడు బీజేపీతో కలిసిపోవడం వల్ల ప్రజల్లో కొంత నమ్మకం జగన్ కోల్పోయారు. అలాగే ఇప్పుడు పోలవరం విషయంలో కూడా కేంద్రం చాలా పథకం ప్రకారం నడుస్తుంది. పోలవరం విషయంలో కూడా జగన్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా వైసీపీకి చెడ్డపేరు తీసుకురావడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరాన్ని పూర్తి చెయ్యకపోతే జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో జగన్ పై నమ్మకం పోతుంది. ఇలా నమ్మకంపోతే జగన్ కు రానున్న రోజుల్లో బీజేపీ వల్ల ఇబ్బందులు ఎదురు కానున్నాయి.
బీజేపీపై జగన్ పోరాడగలడా!!
తెలుగు రాజకీయాల్లో ప్రవేశించడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని దెబ్బతియ్యడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే పోలవరానికి నిధులు ఇవ్వడం లేదు. బీజేపీ చేస్తున్న రాజకీయాలపై రానున్న రోజుల్లో జగన్ ఎలా పోరాడుతారో వేచి చూడాలి. బీజేపీ పోరాడటానికి జగన్ చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఆయనపై ఉన్న కేసులను మళ్ళీ ఎక్కడ లేవదిస్తారోనని.