YS Jagan: వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడిందని తెలియజేశారు.
ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి జమిలి ఎన్నికల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధంగా జమిలి ఎన్నికలను తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆంధ్రలో కూడా ముందస్తు ఎన్నికలే వస్తాయి. అయితే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగిన ఆంధ్రాలో మాత్రం 2029వ సంవత్సరంలోనే ఎన్నికలు జరుగుతాయి అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నికలపై స్పందించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మరోసారి జమిలీ ఎన్నికల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతుందని తెలిపారు.. జమిలీ ఎన్నికలు కూడా త్వరలోనే వస్తాయని చెబుతున్నారు ఎంత తొందరగా ఆ ఎన్నికలు వస్తే అంతే తొందరగా చంద్రబాబు నాయుడుని ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలని ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారని జగన్ తెలిపారు.
బాబు చొక్కా పట్టుకొని ప్రశ్నించి తరిమికొట్టే రోజు చాలా దగ్గరలో ఉందని జగన్ తెలిపారు. చంద్రబాబుని నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని నేను పదేపదే చెప్పాను. అయినప్పటికీ ఆయనకు ఓట్లు వేసి నిద్రపోతున్న చంద్రముఖిని లేపారు అంటూ జగన్ మరోసారి చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కూడా ఈయన కార్యకర్తలకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించారు.