మీరే నా గాడ్ ఫాథర్స్ అన్న చిరంజీవి

చిరంజీవి అంటే ఒకప్పుడు తిరుగులేని మెగాస్టార్. రాజకీయాల కోసం పడి సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలు పెద్ద ప్లాప్ అయ్యాయి.

ఇప్పుడు తాజాగా ‘గాడ్ ఫాదర్ ‘ సినిమాతో దసరాకి వస్తున్నాడు. సినిమా మీద ఇప్పటికి ఎలాంటి అంచనాలు లేవు. కానీ నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాళ్ళ ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది.

ఈ ఈవెంట్ లో మాత్రం అల్టీమేట్ మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు ఉండిపోయారు.  తన గురించి ఎన్నో విషయాలు పంచుకున్న చిరంజీవి  తన చివరి మాటలుగా తన గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా మాటలు ఇవని నాకు ఇండస్ట్రీ లో రావడానికి ఏ గాడ్ ఫాథర్ లేకపోవచ్చు కాని ఇప్పటివరకు నన్ను ఆదరిస్తూ వచ్చిన నా ఆశేష అభిమాన జనమే నా గాడ్ ఫాథర్స్ అని మెగాస్టార్ అయితే తన మాస్ స్పీచ్ తో అన్నారు.