Karthi : సాధారణంగా ఒకప్పుడు హీరోలు కేవలం హీరో పాత్రలలో మాత్రమే నటించేవారు కానీ విలన్ పాత్రలలో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇటీవల సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు కూడా కథా ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి ఏమాత్రం వెనకాడటం లేదని చెప్పాలి. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సైతం విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఈయన ఇదివరకే ఇలాంటి పాత్రలలో ప్రేక్షకులను మెప్పించారు కానీ ఈసారి తన అభిమాన హీరో టాలీవుడ్ హీరో కి ఈయన విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరి ఏ హీరోతో కార్తీ గొడవ పడటానికి సిద్ధమయ్యారు ఎవరి సినిమాలో ఈయన విలన్ గా నటించబోతున్నారు అనే విషయానికి వస్తే… టాలీవుడ్ ఇండస్ట్రీలో కార్తి ఫేవరెట్ హీరో ప్రభాస్ అనే సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్పిరిట్ సినిమాలో నెగిటివ్ పాత్రలో కార్తీక్ కనిపించబోతున్నారని సమాచారం.
ఈ విధంగా కార్తీ నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా నిజమైన అభిమాని అంటే మీరే అంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న స్పిరిట్ సినిమాలో విలన్ పాత్ర అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కార్తీక్ సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.