ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. దేశంలోని హిందుత్వ వాదులంతా ఏపీలోని హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను ఖండిస్తున్నారు. తాజాగా కూడా మరో ఘటన చోటు చేసుకోవడంతో హిందుత్వ వాదులంతా ఆందోళన చెందుతున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరగడమంటే అది హిందూ మతంపై జరిగిన దాడిగానే భావించాలి. అయితే.. బీజేపీ పార్టీ ఈ దాడులపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే.. బీజేపీ అంటేనే హిందుత్వ పార్టీ కదా. అందుకే.. పార్టీ ఈ ఘటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏకంగా బీజేపీ జాతీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు.
త్వరలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రామతీర్థం రానున్నారట. ఇక్కడికి వచ్చి.. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారట. యూపీ సీఎంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తారు అనే వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఎటు చూసినా.. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఏపీ ప్రభుత్వాన్నే అందరూ విమర్శిస్తున్నారు. బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ నే విమర్శిస్తోంది. చంద్రబాబు కూడా వైసీపీనే విమర్శిస్తూ.. హిందూ దేవాలయాల దాడులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఒకవేళ బీజేపీ జాతీయ నాయకులు కనుక ఏపీకి వస్తే.. వాళ్లు రామతీర్థాన్ని సందర్శిస్తే.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. బీజేపీ ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకొని వైసీపీ మీద బురద రాజకీయం చేసి సక్సెస్ అవ్వాలని చూస్తోంది. చూద్దాం మరి.. ఇది ఎంత దూరం వెళ్తుందో?