Star Heroine Got Covid Positive : కరోనా స్టార్స్ : నిన్న ఓ బిగ్ స్టార్ హీరోయిన్ కి పాజిటివ్! ఈరోజు మరో హీరోయిన్ నెగిటివ్.!

Star Heroine Got Covid Positive : ప్రతి సంవత్సరం కూడా ఆరంభంలో చాలా పాజిటివ్ మైండ్ తో స్టార్ట్ అవ్వాలని అనుకుంటారు. కానీ ఈ 2022 సంవత్సరం ఊహించని పాజిటివ్స్ తో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. అసలు ఎవరికీ రాకూడదు అనుకున్న కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ కలకలం ఇప్పుడు భారతదేశాన్ని కుదిపేస్తోంది.

అయితే ఈ పాజిటివ్ కేసుల్లో సౌత్ ఇండియాన్ సినిమాకి చెందిన హీరోలు హీరోయిన్ లు అలాగే నిర్మాతలు మ్యూజిక్ కంపోజర్స్ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా అధిక స్థాయిలో నమోదు అయ్యారు. అయితే ఈ నటులలో స్టార్ హీరోయిన్స్ కూడా కొందరు ఉన్నారు.

 

మరి ఈ కరోనా స్టార్స్ లో నిన్ననే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పాజిటివ్ అయ్యినట్టుగా తెలిపి షాక్ ఇచ్చింది. మరి ఈరోజు మాత్రం మరో స్టార్ హీరోయిన్ తాను నెగిటివ్ అయ్యినట్టు తెలిపింది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ సహా కోలీవుడ్ లో స్టార్ అయ్యినటువంటి త్రిష కృష్ణన్.

ఈరోజు ఉదయమే ఈ గుడ్ న్యూస్ ని త్రిష షేర్ చేసి మొట్ట మొదటి సారి ఒక నెగిటివ్ రిపోర్ట్ చాలా ఆనందం కలిగించింది అని తెలిపింది. అయితే ఈ పాజిటివ్ వైబ్స్ వింటుంటే మూడో వేవ్ కేసులు ఎక్కువ ఉన్నా వాక్సిన్ వేసుకున్నవారికి అంత ప్రమాదం లేదు అని మాత్రం అర్ధం అవుతుంది.