ఆ రెండు సీన్స్ తో స్టార్ట్ అయ్యిన శంకర్, చరణ్ సినిమా!

With These Scenes Shankar Ram Charan Film Started | Telugu Rajyam

మెగాపవర్ రామ్ చరణ్ మరియు ఇండియన్ ఐకానిక్ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా సినిమా ఇటీవల స్టార్ట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. పూణే లో స్టార్ట్ అయ్యిన ఈ భారీ సినిమాపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఈ సినిమా ఒక భారీ ఏక్షన్ సీక్వెన్స్ తో అలాగే ఒక సాంగ్ ని కూడా ప్లాన్ చేశారట.

మొదట ఏక్షన్ సీక్వెన్స్ ని పూణే లో చిత్రీకరణ ప్లాన్ చెయ్యగా సాంగ్ ని మాత్రం హైద్రాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. శంకర్ మార్క్ లో సాలిడ్ కాన్సెప్ట్ తో అంతే లావిష్ గా ఉంటుందట. అలాగే ఇందులో కియారా కూడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం శంకర్ మళ్లీ తన విజన్ చూపే ప్రయత్నం ఈ సినిమాతో చేస్తున్నారు ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles