అద్భుతమైన పోస్టర్ తో “రాధే శ్యామ్” నుంచి బిగ్ అప్డేట్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా “రాధే శ్యామ్” నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ ఇప్పుడు అందించారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన స్వచ్ఛమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్ నుంచి మొట్ట మొదటి సాంగ్ ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు చిత్ర నిర్మాతలు అన్నిటికీ కలిపి ఒక అప్డేట్ ని ఇచ్చేసారు.

ఐదు భాషల్లో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ చేసారు. తెలుగులో “ఈ రాతలే” లైన్ తో సాంగ్ ని రిలీజ్ చేయనుండగా ఈ పోస్టర్ ని గమనించాల్సి ఉంది. దీనిని చూస్తే అంతా నీటిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎగిరే కారు అందులో హీరో హీరోయిన్స్ కానీ ఎదురుగా ఓ గ్రహం ఇవన్నీ చూస్తుంటే మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇంతకీ డేట్ ఎప్పుడో చెప్పలేదుగా ఈ సాంగ్ ని అన్ని భాషల్లో వచ్చే 15వ తారీఖున సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ యూవీ మేకర్స్ తెలిపారు.