Ghani trailer : వరుణ్ తేజ్ ‘గని’ ట్రైలర్ చూస్తారా?

Ghani trailer : 2019 లో హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దలకొండ గణేశ్ లో కనిపించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మూడేళ్ళ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందు కొస్తున్నాడు. గని అనే టైటిల్ తో ఈసారి స్పోర్ట్స్ డ్రామా తో సిద్ధమవుతున్నాడు. దీని ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైంది…

  గని !… ఇక లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామీస్ చెయ్ అని మదర్ మాట తీసుకునే దృశ్యంతో ట్రైలర్ యాక్షన్లోకి దూసుకెళ్తుంది. గనిగా వరుణ్ తేజ్ బాక్సింగ్ రింగ్ లో పోటీకి దిగే యాక్షన్ సన్నివేశాలు, ఎలాగైనా నేషనల్ ఛాంపియన్ అవ్వాలన్న పట్టుదల, రాజకీయాలు, ఆటంకాలు మొదలైన ఫార్ములా ఎలిమెంట్స్ చూపిస్తూ, మధ్యలో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ తో రోమాన్స్, కామెడీ, సాంగ్ వగైరా సాగుతాయి.

బాక్సింగ్ ఆడనని ప్రామీస్ చేసిన మదర్ కి తెలియకుండా నేషనల్ ఛాంపియన్ అయ్యేందుకు వరుణ్ తేజ్ చేసే స్ట్రగుల్ ఈ మూవీ అని ట్రైలర్ లో తెలుస్తుంది. వరుణ్ తేజ్ ని ఓడించడానికి నవీన్ చంద్ర ప్రత్యర్ధి పాత్రలో కనిపిస్తాడు. కోచ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, వరుణ్ తేజ్ తల్లిగా నదియా, తండ్రిగా జగపతి బాబు, పోలీస్ ఆఫీసర్ గా ఉపేంద్ర కనిపిస్తారు. ఇంతకీ వరుణ్ తేజ్ మదర్ బాక్సింగ్ కి ఎందుకు వెళ్ళవద్దని చెప్పిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఇక తమన్  నేపధ్య సంగీతం హైలైట్ అయ్యింది.  కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ ర్ట్స్ మూవీని సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే  రిలీజైన ఈ సినిమా పోస్టర్స్సాంగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ న విడుదలవుతున్న ఈ మూవీ రిజల్ట్ ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

Ghani Trailer | Varun Tej, Saiee M Manjrekar | Kiran Korrapati | Thaman S | Allu Aravind