సునీల్ కోసం ఈసారైనా త్రివిక్రమ్ నిలబడేనా..

Will Trivikram stands for Sunil
Will Trivikram stands for Sunil
సునీల్ ఒకప్పుడు మంచి కమెడియన్. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అందుకే చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు సునీల్ కు అవకాశాలు క్యూ కట్టేవి. ఇక సునీల్ స్నేహితుడు త్రివిక్రమ్ అయితే సునీల్ కోసం సపరేట్ ట్రాక్స్ రాసేవారు. త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన, దర్శకుడిగా చేసిన చాలా సినిమాల్లో సునీల్ కోసం పాత్రలు రాసేవారు.  అవే సునీల్ ను నిలబెట్టాయి. సునీల్ హీరోగా కొత్త టర్న్ తీసుకుని కామెడీ వేషాలు చేయడం మానేశాడు.  హీరోగా ఆయన జర్నీ కొన్నాళ్ళు బాగానే సాగినా ఆతర్వాత గాడి తప్పింది.  వరుస ఫ్లాపులు.  
 
దీంతో త్రివిక్రమ్ అవసరం ఆయనకు మరోసారి వచ్చింది. సునీల్ ఇప్పుడు పాత తరహా కామెడీ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అసలు ‘అల వైకుంఠపురములో’ను సునీల్ కోసం త్రివిక్రమ్ గట్టి ట్రాక్ వేస్తాడని అనుకున్నారు. కానీ అందులో సునీల్ చేసింది చిన్న డాక్టర్ పాత్ర. అదంత పెద్దది, గుర్తుండిపోయేది ఏమీ కాదు.  కానీ ఈసారి మహేష్ బాబుతో చేయనున్న కొత్త సినిమాలో మాత్రం సునీల్ కోసం త్రివిక్రమ్ మంచి పాత్రను, కామెడీ సన్నివేశాలను రాసినట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా సునీల్  కోసం త్రివిక్రమ్ నిలబడతారేమో చూడాలి.