మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందా..!

సర్కారీ వారి పాట తో మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బాబు తన నెక్ట్స్ ప్రాజెక్టు త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను మహేష్ బాబు పుట్టిన రోజు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ సందర్భంగా త్రివిక్రమ్ కు సెంటిమెంట్ గా ఉన్న ‘అ’ అక్షరం మహేష్ బాబు కలిసి వస్తుందా అని అనుమానాలు వస్తున్నాయి.

ఎందుకంటే మహేష్ బాబు సినిమాకు ‘అర్జునుడు’ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ అత్తారింటికి దారేది, అ.. ఆ.., అరవింద సమేత, అల వైకుంఠపురం సినిమాలు మంచి సక్సెస్ లు అందుకోగా.. మహేష్ బాబుకు మాత్రం ‘అ’ అక్షరం మీద వచ్చిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. మరి ఈ అర్జునుడుతో వస్తున్న సినిమా ఎలా కలిసి వస్తుందో చూడాలి.