‘పెళ్లి చూపులు’ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా.?

‘పెళ్లి చూపులు’ సినిమాతో అనూహ్యమైన హిట్ కొట్టి హీరోయిన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చిన ముద్దుగుమ్మ రీతూ వర్మ. తొలి సినిమా ఇంపాక్ట్ రీతూ వర్మపై బాగానే పడింది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ, ఆ రేంజ్ హిట్ అయితే దక్కించుకోలేదనుకోండి అది వేరే విషయం.

ఇక, ఈ మధ్య కరోనా ప్యాండమిక్‌ని ఎదిరించి రీతూ వర్మ నటించిన ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో రీతూ వర్మ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ దక్కలేదు. సినిమాకీ ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో రీతూ వర్మ ఆశలన్నీ అడియాశలైపోయాయి.

ఇక ఇప్పుడు ‘వరుడు కావలెను’ సినిమా పైనే రీతూ వర్మనమ్మకం పెట్టుకుంది. అసలే తెలుగమ్మాయిలకు అవకాశాలే కరువు అనుకున్న తరుణంలో ఏదో అలా అవకాశాలయితే బాగానే దక్కించుకుంటోంది కానీ, అది చాలదు. అసలు సిసలు హిట్ పడాలి. మరి ఆ సిసలైన హిట్ ‘వరుడు కావలెను’ సినిమాతో రీతూ వర్మ దక్కించుకుంటుందా.? చూడాలిక.