హీరోలు, హీరోయిన్లు పర్మనెంట్ టాట్టూలు వేయించుకోవడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. తమకు సూపర్ హిట్ అందించిన సినిమాలు, తమకు బాగా నచ్చిన వ్యక్తుల పేర్లు, రకరకాలైన అర్థాలు వచ్చేలా కొటేషన్లతో కూడిన ‘కోడ్’ టాట్టూలు.. పైగా, వివిధ భాషల్లో వేయించుకునే టాట్టూలు.. చెప్పుకుంటూ పోతే పెద్ద కథే వుంది.
ఇక, అసలు విషయానికొస్తే నాగచైతన్య నుండి విడాకులు పొందిన సమంత తన పర్మనెంట్ టాట్టూల విషయంలో ఏం చేయబోతోంది.? అప్పట్లో తన భర్త నాగచైతన్య పేరుని ‘టాట్టూ’గా ఓ రహస్య ప్రదేశంలో (మరీ రహస్యమేమీ కాదు లెండి.. పలు సందర్భాల్లో ఆ టాట్టూ కనిపించేలా వస్త్రధారణ చేసింది..) వేయించుకుంది సమంత.
ఆ టాట్టూని ఇప్పుడు సమంత తొలగించేసుకుంటుందా.? లేదా.? అన్నదానిపై చర్చ జరుగుతోంది. ప్రభుదేవా ప్రేమలో వున్నప్పుడు నయనతార కూడా పచ్చబొట్లేయించుకుంది.. వాటిని ఆ తర్వాత మార్చేసుకుంది నయనతార.. తనకు అనుగుణంగా.
బహుశా సమంత కూడా. పర్మనెంట్ టాట్టూని తొలగించకుండా, కొత్త అర్థం వచ్చేలా.. అదనంగా ‘చై’ అనే పేరుకి కొన్ని అక్షరాలు తగిలించొచ్చు. అన్నట్టు, వీపు భాగంలో.. బాగా పైన.. అంటే, వెనుకాల మెడపై ‘వైఎంసి’ అనే పచ్చబొట్టు వుంటుంది సమంతకి. ‘ఏ మాయ చేశావె’ దానర్థమట. కానీ, యూ ఆర్ మై లవ్ చైతూ.. అని దానర్థమంటూ అభిమానులు కొత్త అర్థాన్ని అప్పట్లో చెప్పారు.
మరి, సమంత ఈ టాట్టూ ప్రచారాలు, గాసిప్పులపై స్పందిస్తుందా.? వేచి చూడాల్సిందే.