Nara Rohit Contest In 2024 : 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి నారా రోహిత్.?

Nara Rohit Contest In 2024

Nara Rohit Contest In 2024 : సినీ నటుడు నారా రోహిత్ స్వాయానా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోదరుడి తనయుడే. తన సోదరుడ్ని రాజకీయాల్లో ఎదగనీయకుండా చేసి, అందుకు ప్రతిఫలంగా నారా రోహిత్‌ని సినిమాల్లోకి చంద్రబాబే తీసుకొచ్చారన్న ప్రచారం గతంలో జరిగింది.

‘బాణం’ సినిమాతో తెరంగేట్రం చేసిన నారా రోహిత్, స్టార్ హీరో అవలేకపోయినా.. నటుడిగా ఓ మోస్తరు గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. తరచూ టీడీపీ గురించి మాట్లాడుతుంటాడు. టీడీపీ అనుకూలంగా మాట్లాడుతూనే, ఆ పార్టీ కోసం తనవంతుగా ప్రచారం కూడా చేస్తుంటాడు.

అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా రోహిత్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కూడా దిగాలని అనుకుంటున్నాడట. నిజానికి ఇది చంద్రబాబు వ్యూహమేనని అంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచే నారా రోహిత్ బరిలోకి దిగుతాడనే ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే, ప్రచారంలో వున్నట్టుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని వదిలి హిందూపురం నియోజకవర్గం వైపు అడుగులేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇదిలా వుంటే, నారా లోకేష్ అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు పోటీ చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి నారా రోహిత్ పెద్దగా వివాదాల్లో వుండడు. ఇతర హీరోల అభిమానులకూ అతని పట్ల ఒకింత సానుకూలత వుంది. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకునే నారా రోహిత్‌ని చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని సమాచారం.

మరి, నారా రోహిత్.. తన సోదరుడు నారా లోకేష్‌కి రాజకీయాల్లో పోటీ అవుతాడా.? అంటే, చంద్రబాబు వుండగా అది సాధ్యం కాకపోవచ్చు.