Sarkaru Vaari Paata : అల్లూరి వారి బేటా చూస్తారా? ‘సర్కారు వారి పాట’ మూడో పాట!

Sarkaru Vaari Paata :  ప్రిన్స్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మూడో సాంగ్ ఈ ఉదయం వచ్చేసింది… గతంలో విడుదలైన రెండు పాటలు ఫ్యాన్స్ కి మంచి కిక్ నిచ్చాయి. ఇప్పుడు మరోసారి కిక్ ఇచ్చేందుకు మహేష్ బాబు ఇంకో లిరికల్ వీడియోతో వచ్చేశాడు…

‘సర్కారు వారి పాటా అల్లూరి వారి బేటా’ అంటూ మాస్ ఓరియెంటేషన్ తో సాంగ్ ప్రారంభమవుతుంది.ఇందులో మహేష్ దూకుడు, డ్యూటీ రెండూ విజువలైజ్ అవుతూం
టాయి.

బ్యాక్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు, కాయిన్స్ ఎగురుతూ వుంటే బ్యాడ్ క్యారక్టర్స్ ని మహేష్ బాదుతూంటాడు.ఇంకా నానా హంగామా వుంటుంది.’సర్కారు వారి పాట అంతులేని వేట’ అంటూ మాస్ కమర్షియల్స్ లైన్స్ తో లిరిక్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వకుండా వుండదు.

ఎస్. థమన్ రూపొందించిన ఈ టైటిల్ సాంగ్ గాయని హారికా నారాయణన్ హస్కీ వాయిస్ తో పాడింది.శ్రీరామ్ సాహిత్యం.

లిరికల్ వీడియోలో యాక్షన్ బ్లాక్‌ల కోసం వేరే బిజిఎం వస్తూంటుంది.ఇది మహేష్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు తోడ్పడింది.

ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు కూడా విశేష ప్రజాదరణ పొందాయి.మైత్రీ మూవీస్ నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కమర్షియల్ యాక్షన్ మూవీ లో మహేష్ సరసన కీర్తీ సురేశ్ నటించింది.షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘సర్కార్ వారి పాట’ అతి త్వరలోనే అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.అందాకా ఈ సాంగ్ ఎంజాయ్ చేయండి!

***

Sarkaru Vaari Paata - Title Song | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram