Samantha : సమంత సస్పెన్స్: అక్కినేని స్పందన ఏంటి.?

Samantha : ట్వీటేస్తే ఒక తంటా, ఆ ట్వీటు తొలగిస్తే ఇంకో తంటా.! సెలబ్రిటీలంటే ఆమాత్రం హంగామా వుండాలి కదా. వారిని ఫాలో అయ్యేవారికీ అనుమానాలు రావడం సహజమే కదా. ఏ అభిమానుల్నైతే అలరించాలనుకుంటారో, ఆ అభిమానుల ప్రశ్నలకూ సమాధానాలు దొరకాలి కదా.?

సినీ తారలమైనంతమాత్రాన, ప్రైవసీ వుండకూడదా.? అని కొందరు సెలబ్రిటీలు ప్రశ్నించొచ్చుగాక.! అది వేరే సంగతి. అక్కినేని కుటుంబం నుంచి ‘విడాకులతో’ బయటకు వచ్చేసింది సమంత. నాగచైతన్య, సమంత అంగరంగ వైభవంగా పెళ్ళాడారు, విడిపోయారు కూడా. విడిపోయినా, స్నేహితుల్లానే వుంటామన్నట్టుగా విడాకుల ప్రకటన ఇరువురి నుంచీ వచ్చింది.

సమంత సోసల్ మీడియా హ్యాండిల్ నుంచి ‘అక్కినేని’ తొలగింపుతో మొదలైన రచ్చకి, విడాకుల వ్యవహారంతో ముగింపు పడిందనుకుంటే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. రకరకాల ఊహాగానాలు, ఈ క్రమంలో సమంత కోర్టును ఆశ్రయించడం.. ఇదంతా తెలిసిన సంగతే.

మళ్ళీ ఇప్పుడు సమంత సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి విడాకుల ప్రకటన మాయమవడంతో కొత్త అనుమానాలు షురూ అయ్యాయి. మరోపక్క, ‘పళ్ళున్న చెట్టకే రాళ్ళ దెబ్బలు..’ అంటూ అక్కినేని నాగార్జున, నాగచైతన్య వ్యాఖ్యానించారంటూ వార్తలొచ్చాయి. అయితే, సమంతతో అక్కినేని నాగచైతన్య మళ్ళీ ప్యాచప్ అవబోతున్నాడన్న ప్రచారంపై మాత్రం అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

‘మీరిద్దరూ మళ్ళీ కలిసిపోండి ప్లీజ్..’ అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. ఏమో, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.