ఆ విషయం లో మోహన్ బాబు నచ్చదు అంటున్న విష్ణు

మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు అంటే చాలా గౌరవిస్తాడు. తన తండ్రి మాట కాదనడు అనే పేరు కూడా ఉంది. లక్ష్మి, మనోజ్ ఎలా ఉన్నా…విష్ణు మాత్రం మోహన్ బాబు కి చాలా గౌరవం ఇస్తాడు. ఇది చాలా సందర్భాల్లో జనం చూసారు. నిన్న జరిగిన ‘జిన్నా’ ప్రీ-రిలీస్ ఈవెంట్ లో మంచు విష్ణు తన తండ్రితో తనకి నచ్చని ఒక గుణం గురించి చెప్పాడు.

నాన్న మోహన్ బాబులో నాకు అన్నీ ఇష్టమేనని విష్ణు వెల్లడించారు.అయితే నాన్న కోపం మాత్రం నచ్చదని విష్ణు చెప్పుకొచ్చారు.నా భార్య కంటిచూపుతోనే బెదిరిస్తుందని నా తల్లి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే విషయంలో దిట్ట అని విష్ణు అన్నాడు.

అలాగే తన సినిమాకు కోరియోగ్రఫీ చేసిన ప్రభు దేవా కనీసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని చెప్పాడు విష్ణు. తమ్ముడి సాంగ్ కు కొరియోగ్రఫీ చేస్తే డబ్బులు తీసుకోనని అన్నాడని విష్ణు చెప్పుకొచ్చారు.

ఇప్పటికే కావలసినంత బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 న రిలీజ్ కి సిద్ధం గా ఉంది. ఈ సినిమా పై టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.  ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.