మన వాళ్ళు మనకి ఎప్పుడూ తక్కువే. అందుకు నిదర్శనమే మెగాస్టార్ చిరంజీవి పట్ల తెలుగు మీడియా వ్యవహరిస్తున్న తీరు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన మీడియా సంస్థల్లో సగం వాటికి చిరంజీవి అంటే గిట్టదు. రాజకీయ, సామాజిక పరమైన అంశాల్లో చిరంజీవిని అస్సలు ఎంకరేజ్ చేయవు. అందుకే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవట్లేదు.సోనూ సూద్ సేవా కార్యక్రమాలను ఆకాశానికెత్తేసిన తెలుగు మీడియా చిరంజీవి చేస్తున్న పనులను మాత్రం గుర్తించలేకపోతోంది. సోనూ సూద్ పేరును చూపించి చిరంజీవి లాక్ డైన్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు అంటూ ఎత్తిపొడుపు మాటలు మాట్లాడింది ఒక వర్గం మీడియా.
కానీ గత లాక్ డౌన్ టైంలో ఆయన ఇచ్చిన విరాళాలను, కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులకు ఆయన అండగా నిలిచిన వైనాన్ని మర్చిపోయాయి. తాజాగా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ బ్యాంక్స్ పెడుతున్నారు. ఇప్పటికే అనేకమంది ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ ద్వారా సహాయం పొందారు, పొందుతున్నారు. ఈ కార్యక్రమం మొత్తం చిరు సొంత నిధులతో చేస్తున్నదే. దీన్ని ఏ పత్రికా పెద్దగా చర్చించట్లేదు. చేసే మంచి పనిని పదిమందికి తెలియజేస్తే దానికి ఇంకో నాలుగు చేతులు తొడవుతాయి. అప్పుడా సహాయం పదింతలు అవుతుంది. కానీ మన మీడియాకు వేరొకరి మీద ఉన్న శ్రద్ధ సొంత వ్యక్తుల మీద లేదే.