Samantha : అక్కినేని నాగచైతన్య – సమంతల మధ్య వైవాహిక బంధం ఇటీవలే తెగిపోయింది. ఇద్దరూ పరస్పర అవగాహనతో విడాకులు తీసుకున్నారు. విడిపోయినా, తమ మధ్య స్నేహం అలాగే వుంటుందన్నట్టుగా విడాకుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇరువురూ పేర్కొన్నారు. సో, అక్కడితో విడాకుల వ్యవహారం ప్రశాంతంగా ముగిసినట్లే లెక్క.
ఎవరి దారిలో వారు ముందుకు వెళుతున్నారు. నాగచైతన్య తన సినిమాలతో బిజీగా వున్నాడు. సమంత కూడా పలు సినిమాల్లో నటిస్తోంది. సమంత మీద ఎలాగైతే ట్రోలింగ్ జరుగుతోందో, నాగచైతన్య మీద కూడా అలాగే ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది. అయితే, నాగచైతన్య ఏనాడూ ఆ ట్రోలింగ్‌ని పట్టించుకోలేదు. సమంత మాత్రం, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటూ, ట్రోలింగ్‌కి కౌంటర్లు ఇస్తూ వెళుతోంది.
ఇక, తాజాగా సమంత తన విడాకుల వ్యవహారంపై స్పందించింది. విడాకుల తర్వాత ఓ దశలో తాను చనిపోతానేమోనని భయపడినట్లుగా చెప్పుకుంది. ఈ రోజు ఇంత ధైర్యంగా తాను నిలబడతానని ఆమె అనుకోలేదట. ఇవన్నీ సమంత ఇప్పుడెందుకు చెబుతోంది.? ఓ మహిళగా తన ఆవేదనని ఆమె చెప్పుకోవచ్చుగాక. కానీ, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాక.. ఈ తరహా వ్యాఖ్యలతో ఖచ్చితంగా నాగచైతన్య ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని సమంత తెలుసుకోకపోతే ఎలా.?
రేప్పొద్దున్న నాగచైతన్య ఈ వ్యవహారాలపై స్పందించాల్సి వస్తే, ఎలా స్పందిస్తాడు.? అన్న చర్చ అప్పుడే షురూ అయ్యింది. సమంతని తన కోడలిలా కాకుండా కూతురిలా చూసుకున్న అక్కినేని నాగార్జున కూడా తాజా పరిణామాలతో ఒకింత హర్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ.
పూర్తిగా సమంతని తప్పు పట్టేయలేంగానీ, ఆమె చేస్తున్న ప్రతి వ్యాఖ్య.. ఖచ్చితంగా ట్విస్ట్ అవుతూ వుంటుంది. అది ముందు ముందు మరింత పెద్ద వివాదానికి కారణమయ్యే అవకాశాల్లేకపోలేదు.