ఒక్క మహేష్ సినిమా కోసం మాట్లాడని ఈ హీరోలు.. కానీ మహేష్ మాత్రం చెప్పాలి.!

 mahesh movie  : తెలుగు సినిమా దగ్గర గాని ఆ హీరోల మధ్య గాని నిజంగానే వైషమ్యాలు ఉంటాయా అనే మాటకు చాలా వరకు లేదనే అనుకోవచ్చు కానీ కొన్ని సందర్భాలలో మాత్రం కొన్ని నిజాలు క్లియర్ గా ఆడియెన్స్ లోకి వెళ్లిపోతాయి. ఇప్పుడే అదే రకమైన సందర్భం టాలీవుడ్ లో కనిపిస్తుంది. రీసెంట్ టైం లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మంచి హిట్ కూడా అయ్యాయి. అలాగే ఇతర హీరోలు నిర్మాతలు అంతా బాగానే కొనియాడారు.
అయితే ఎక్కువగా ఇతర ఏ హీరో సినిమా వచ్చినా కూడా ఎలాంటి ఈగో లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నోసార్లు పొగుడుతూ ట్వీట్ లు పోస్ట్ చేసాడు. అందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల అన్ని సినిమాలపై కూడా చేసాడు. అయితే ఇప్పుడు తీరా మహేష్ సినిమా విషయానికి వస్తే ఒక్కరంటే ఒక్క మెగా హీరో కూడా కనీసం ట్వీట్ చేయకపోవడం గమనార్హం.
తాజాగా మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమాకి చాలా మంది ఇతర తారలు కామెంట్ చేశారు. కానీ మెగా ఫ్యామిలీ హీరోలు మాట్లాడలేదు. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి సినిమాల టైం లో మహేష్ ఎలాంటి భేదం లేకుండా మాట్లాడినా వారు ఒక్కరూ మహేష్ ని సపోర్ట్ చేస్తూ రాలేదని అంటున్నారు.
అలాగే వీరితో పాటుగా నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే బాలయ్య మాత్రం సర్కారు వారి పాట ఒక స్పెషల్ షో లో చూశారని టాక్ ఉంది. అందుకే వారి వైపు ఎవరూ వెళ్ళలేదు కానీ మెగా ఫ్యామిలీ ని మాత్రం మహేష్ ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేశారు. మరి ఈ గ్యాప్ లో ఏమన్నా మెగా హీరోలు పోస్ట్ వేస్తారో లేదో చూడాలి.