మంచు విష్ణు పెళ్లి ఆ స్టార్ హీరో కూతురితో ఎందుకు ఆగిపోయింది?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోహన్ బాబు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా ఒక వెలుగు వెలిగాడు. కానీ ఆయన కొడుకులు విష్ణు, మనోజ్ కనీసం హీరోలుగా కూడా ఇంకా నిలదొక్కుకోలేకపోయారు. ఇప్పటివరకు దాదాపు 25  సినిమాల్లో నటించిన విష్ణు ఒక్క బ్లాక్బస్టర్ హిట్ కూడా ఇవ్వలేదు. తొందర్లో ‘జిన్నా’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఎలా వుండబోతుందో చూడాలి.

ఇప్పుడు విష్ణు గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఒకప్పుడు మోహన్ బాబు తన కూతురు లక్ష్మి ని ఒక స్టార్ హీరో కొడుకుతో పెళ్లి చేద్దాం అనుకున్నాడంట కానీ లక్ష్మి తనకు సినిమా కి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనడంతో ఏమి చెయ్యలేకపోయాడు.

అలాగే మంచు విష్ణు ని కూడా తనకు ఎంతో సన్నిహితుడైన ఒక స్టార్ హీరో కూతురితో వివాహం జరిపించాలని అనుకున్నాడంట. కానీ అప్పటికే విష్ణు విరోనికా ని ప్రేమించానని చెప్పడంతో ఆమెతోనే పెళ్ళిచేసాడు మోహన్ బాబు.