Kajal Felt Bad : కాజల్ అగర్వాల్ ఎందుకు అంతలా హర్ట్ అయ్యిందంటే.!

Kajal Felt Bad : హీరోయిన్ కాజల్ అగర్వాల్ మామూలుగా అయితే వివాదాల జోలికి వెళ్ళదు. కాజల్ మీద అందుకేనేమో గాసిప్స్, రూమర్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి కాజల్ అగర్వాల్, సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేనా, గట్టిగా క్లాస్ కూడా పీకింది. ఇంతకీ, కాజల్ ఇంతలా స్పందించడానికి కారణమేంటి.?

కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కాస్త బొద్దుగా తయారైంది. అదే, ట్రోలింగ్‌కి కారణమయ్యింది. కాజల్ మీద అత్యంత హేయంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు. దాంతో, కాజల్, అలా ట్రోల్ చేసేవారికి బుద్ధి చెప్పాలనుకుంది. సోషల్ మీడియా వేదికగా కాజల్ తనదైన స్టయిల్లో హేటర్స్‌కి క్లాస్ తీసేసుకుంది.

ప్రెగ్నెన్సీ గొప్పతనాన్ని చెబుతూ, మాతృత్వం అనే గొప్ప అనుభూతికోసం తానెంతగా ఎదురు చూస్తున్నదీ వివరించింది. ఈ క్రమంలో తన శరీరంలో వచ్చిన, వస్తున్న మార్పుల గురించి ప్రస్తావించింది. బిడ్డకు జన్మనిచ్చాక, తిరిగి తన పూర్వపు సౌందర్యం వుంటుందో లేదో కూడా తెలియదని చెప్పింది.

లివ్ అండ్ లెట్ లివ్.. బతకండి, బతకనివ్వండి.. అంటూ కాజల్ అగర్వాల్, తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించిందంటే, ఆమె ఎంతలా బాధపడి వుండాలి. కాజల్ ఇలా పెద్ద స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా స్పందిస్తున్నారు.

కాగా, కాజల్ అగర్వాల్ నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా వున్న విషయం విదితమే. దీంతోపాటు, ఓ తమిళ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.

ట్రోలింగ్ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం కాజల్.. ప్రెగెన్సీ నేపథ్యంలో ఆ మధురానుభూతుల్ని మరింత మధురంగా మలచుకునేందుకు విదేశీ పర్యటనల్లో చాలా బిజీగా వుంది. అక్కడి నుంచే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో తన అభిమానులతో ఆ అనుభూతుల్ని పంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.