ఆ దర్శకుడి పైన చిరంజీవి కి ఎందుకంత పగ?

నలభై సంవత్సరాల అపారమైన అనుభవం, తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన చిరంజీవి హిట్, ప్లాప్ కి అతీతంగా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ముప్పై సంవత్సరాలు ఏలాడు. రాజకీయాలకోసం ఒక దశాబ్ద కాలం సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సైరా’, ‘ఆచార్య’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి.

అయితే ఈ మధ్య చిరంజీవి ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఒక దర్శకుడిని తీవ్రం గా విమర్శిస్తున్నాడు. అతనే కొరటాల శివ. తాజాగా  ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా బాగోలేకుంటే ఆడియన్స్ ధియేటర్ కి రారు, రెండో రోజే ఆ సినిమాని ధియేటర్ నుంచి తీసేస్తారు. రీసెంట్ గా నేనూ ఆ బాధితుడినే, నా సినిమా కూడా తీసేశారు… దర్శకులు కాంబినేషన్స్ కోసం సినిమాలు చేయకూడదు” అంటూ స్ట్రెయిట్ గా ఆచార్యని కొరటాలని పాయింట్ అవుట్ చేశారు.

చిరంజీవి కూడా తన కెరీర్ లో ఎన్నో  ప్లాప్స్ , అట్టర్ ప్లాప్స్, డిజాస్టర్స్ కూడా చూశారు. లెజెండరీ దర్శకులు అయిన దాసరి, రాఘవేంద్ర రావు  కూడా చిరంజీవి కి డిజాస్టర్స్ ఇచ్చారు. ఒక సినిమా విజయాన్ని అనేక విషయాలు నిర్ణయిస్తాయి.

నిజానికి కొరటాల శివ చాలా మంచి డైరెక్టర్. నాలుగు సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ కి స్క్రిప్ట్ పైన మంచి గ్రిప్ ఉంటుంది. మహేష్ బాబు కోసం రాసుకున్న రోల్ లో చిరంజీవి రామ్ చరణ్ ని బలవంతంగా ఇరికించారు. అప్పటికే రామ్ చరణ్ కి పాన్  ఇండియా ఇమేజ్ రావడం వల్ల తమ సినిమాకు మైలేజీ వస్తుండుకున్నాడు చిరంజీవి.

పది నిముషాలు, పావుగంట మాత్రమే ఉన్న గెస్ట్ రోల్ ని… చరణ్  ఓకే చెప్పాడు కాబట్టి… 40 నిమిషాలకి పెంచి సినిమా చేసాడు చిరంజీవి. అయితే ఎప్పుడైతే కథ మొత్తం మారిపోయిందో, కాజల్ పాత్ర మొత్తానికి తీసేసారో…అప్పటికే సినిమా గాడి తప్పింది.

అయితే ఆ సినిమా ప్లాప్ కి కారణం కేవలం కొరటాల శివ మాత్రమే అన్నట్టు చిరంజీవి అనేక సందర్భాల్లో చెప్పడం మంచిది కాదు.