మీడియా అంటే చిరంజీవి కి ఎందుకంత భయం?

మెగాస్టార్ చిరంజీవి ది నాలుగు ద‌శాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చ‌విచూశారు. ఎంతమంది పోటీ ఉన్నా మెగాస్టార్ గా ఎదిగి మూడు ద‌శాబ్దాల పాటు… టాలీవుడ్ ని శాశించాడు. అలాంటి చిరంజీవి ఇప్ప‌టికీ మీడియాకు భ‌య‌ప‌డిపోవ‌డం.. ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. కానీ… ఇది నిజం. ఈ విష‌యం ఆయ‌నే ఒప్పుకొన్నారు.

గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీడియాలో వ‌చ్చిన రాత‌లు ఆయ‌న్ని కంగారు పెట్టిన‌ట్టు మీడియా ముందే చెప్పేశారు. మీడియాకి భ‌య‌ప‌డే… ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో వ‌ర్షం ప‌డినా… ఆ వర్షంలో త‌డుస్తూనే సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. ఇదంతా మీడియాకు భ‌య‌ప‌డే. “వ‌ర్షంతో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ర‌సాభ‌స అయ్యింది రాసి మీడియా కంపు చేస్తుంద‌న్న భ‌యంతో మాట్లాడాల్సివ‌చ్చింది” అని అస‌లు నిజాన్ని ఒప్పుకొన్నారు మెగాస్టార్‌.

సినిమాకి ప‌బ్లిసిటీ చేయ‌డం లేద‌ని, హైప్ లేద‌ని, మార్కెట్ జ‌ర‌గ‌డం లేద‌ని…. వార్త‌లు రావ‌డం ఆయ‌న్ని తీవ్రంగా క‌ల‌చివేసింది. అందుకే `మేం ఎప్పుడు ఏం చేయాలో.. మీరే చెబుతారా? మాకు ఆమాత్రం తెలీదా` అంటూ మీడియాపై డైరెక్ట్ ఎటాక్ చేసేశారు. కాక‌పోతే… అక్క‌డే కాస్త సంయ‌మ‌నం పాటిస్తూ… సినిమా విడుద‌లైన త‌ర‌వాత‌.. వ‌చ్చిన పాజిటీవ్ రివ్యూల‌కు థ్యాంక్స్ చెప్పారు. మ‌ళ్లీ మీడియాని కాస్త లేపే ప్ర‌య‌త్నం చేశారు.

అంత సీనియర్ అయినా కానీ ఇప్పటికీ మీడియా కి భయపడుతున్నాడు అంటే కొంచెం ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ మీడియా కి అస్సలు భయపడట్లేదు, పైగా మీడియా ని కేర్ కూడా చెయ్యడం లేదు.