Charan Saying It Lite : ‘ఆచార్య’ సినిమాకి తొలుత కొరటాల శివ, అతిథి పాత్ర కోసం మహేష్‌బాబు పేరు అనుకున్న సంగతి తెలిసిందే. ‘నేను అడిగితే మహేష్ ఓకే చెప్తారు..’ అని కొరటాల శివ, ‘ఆయన అడిగితే నేను చేయకుండా వుంటానా.?’ అని మహేష్ వేర్వేరు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. చిరంజీవి అంటే మహేష్‌బాబుకి ప్రత్యేకమైన అభిమానం కూడా.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్లు జోరందుకున్నాయి. కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్.. మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్‌బాబు ప్రస్తావన కూడా వస్తోంది.
కథ రాసుకునే క్రమంలో దర్శకుడి మదిలో పలువురు హీరోల పేర్లు మెదులుతాయి. అలా మహేష్ పేరు కూడా కొరటాల మదిలో మెదిలి వుండొచ్చు. ఆ విషయం చరణ్‌కి తెలియాలనే రూల్ అయితే ఏమీ లేదు కదా.? చిరంజీవి కావాలనే మహేష్‌ని తప్పించారనే ప్రచారంలో వాస్తవం వుండి వుండదు.
ఎందుకంటే, చిరంజీవికి మహేష్ చాలా ఆప్తుడు. పైగా, ‘ఆచార్య’ సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. సో, ఇక్కడ చరణ్ లైట్ తీసుకున్నదేమీ లేదు. కాకపోతే, ‘ఆచార్య’ మీద కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంతే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో చరణ్ – ఎన్టీయార్ మధ్య విభేదాలు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాల్లాంటివే ఇప్పుడూ జరుగుతున్నాయన్నమాట.