Home News మహేష్ ఢీకొట్టబోయే ఆ తమిళ స్టార్ ఎవరు ?

మహేష్ ఢీకొట్టబోయే ఆ తమిళ స్టార్ ఎవరు ?

Who Will Locks Horns With Mahesh Babu In Sarkaaru Vaari Paata
తెలుగులో ఒక్క జగపతిబాబు మినహా చెప్పుకోదగిన స్టార్ విలన్ మరొకరు లేరు. అందుకే మన స్టార్ హీరోలు పర భాషల్లో విలన్లను వెతుక్కుంటున్నారు.  తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ అదే పని చేస్తున్నారట. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రం చేస్తున్నాడు.  షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతున్నా ఇందులో ప్రతినాయకుడు ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు టీమ్.  దీంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  నిన్న మొన్నటివరకు తమిళ స్టార్ నటుడు అర్జున్ ఇందులో విలన్ రోల్ చేస్తాడని వార్తలు రాగా ఇప్పుడు ఆ పేరు మారింది. 
 
ఫామ్లో ఉన్న తమిళ యాక్టర్ సముద్రఖని మహేష్ సినిమాలో విలన్ అని అంటున్నారు.  సముద్రఖని ఇటీవల చేసిన ‘అల వైకుంఠపురములో, క్రాక్’ చిత్రాలు భారీ విజయాలుగా నిలిచాయి.  రెండింటిలోనూ సముద్రఖని నటన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.  స్టార్ హీరోలకు మంచి విలన్ అనే పేరు తెచ్చుకున్నాడు.  అందుకే ఆయన్ను తీసుకోవాలని పరశురామ్ భావిస్తున్నాడట.  అయితే ఈ ఇద్దరిలో మహేష్ ఢీకొట్టబోయేది ఎవరిని అనేది పక్కా కన్ఫర్మేషన్ రావాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.  ఇకపోతే మహేష్ వీలైనంత త్వరగా పరశురామ్ సినిమాను ముంగించి త్రివిక్రమ్ చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.  

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News