Sreeja konidela: కళ్యాణ్ దేవ్ ని శ్రీజ పక్కన పెట్టడానికి అసలు కారణం అదేనా?

Sreeja konidela: సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలే ఎక్కువగా విడాకుల బాట పడుతున్నారు. అన్ని ఇండస్ట్రీలలో సెలబ్రిటీలు వారి వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వారి విడాకుల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజుల పాటు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ దంపతులు కిరణ్ రావు, అమీర్ ఖాన్ విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం కోలీవుడ్ జంట హీరో ధనుష్ భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరొక జంట విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వారు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ అల్లుడు కళ్యాణ్ దేవ్. శ్రీజ, భర్త కళ్యాణ్ విడిపోయారు అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కళ్యాణ్ దేవ్ నటించిన సినిమాలకు మెగాహీరోలు మద్దతు ఇవ్వకపోవడంతో అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. శ్రీజ కూడా హీరోయిన్ సమంత మాదిరిగా తన పేరు పక్కన భర్త పేరు ను తొలగించడంతో అలాగే విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.

అయితే మరి ఈ విషయంపై శ్రీజా కానీ అటు కళ్యాణ్ దేవ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు, స్పందించలేదు. మరి అసలు కారణం ఏంటి అని మెగా అభిమానులు ఆరా తీయగా మెగా కుటుంబం అండగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని, అందుకే శ్రీజ తనతో కలిసి ఉండలేక తన నుంచి విడాకులను కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయం మాత్రం ఇప్పటి వరకు బయట పడలేదు. ఇటీవ‌ల‌ కళ్యాణ్ దేవ్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడంతో… అభిమానులకు పెద్ద ఎత్తున సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే మెగా కుటుంబం స్పందించే అంతవరకు వేచి చూడాల్సిందే.